Dont read it till the end if u are not ready to accept/digest my views at any point...
ఓ రేంజ్ కాయ!!...
CC camera లో లాగ camera రూం లో మూలాన ఉండి రూం ని అంత కవర్ చేస్తుంది. ఇంతలో 3lok కి మెసేజ్ వచ్చింది. చూస్తున్నాడు. camera మొబైల్ లోకి జూమ్ అయింది. A new message from Sriku " రేపు నైట్ సెకండ్ షో కి Orange కి వెళ్దామా!!"..3lok పేస్ పైన corner లో రెండు మేఘాలు వచ్చి(dreams ఎస్కోడానికి మూవీ లో వచ్చే మేఘాలన్నమాట)..ఆ మేఘాల్లో 3lok తనలో తానె ఉహించుకున్తున్నవి అన్ని కనిపిస్తున్నాయ్...."సినిమా బాలేదన్నారు కదా..ఎల్దామా!! వద్దా!!..కొత్త హీరోయిన్ బానే ఉందంట...సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయ్ కాబట్టి చుసేయోచ్చు. కాబట్టి అర గంట తీసేస్తే ఇంకో రెండు గంటలు. genelia ఎలానో నాకు నచ్చుతుంది కాబట్టి పర్వాలేదు. కాని సినిమా అర్థం అవట్లేదు అంటున్నారు??...ఆయన అర్థం కావని అపరిచితుడికి అలానే అన్నారు, Inception కి అలానే అన్నారు, ఖలేజ కి అలానే అన్నారు. అయినా నాకు అర్థం అయ్పోయాయి నచ్చేసాయి...నాకు అర్థం కాని సినిమాలు తీసే మగాడు ఇంకా పుట్టలేదు" అని కాలర్ ఎగరేసాడు ౩లొక్..."సినిమా చూసేయోచ్చు గాని పాటలు బాగుంటాయి కాబట్టి టికెట్స్ కష్టమయిన కూడా చూస్తె మల్లికార్జున లాంటి మంచి theatre లోనే చూడాలి అని లాక్ చేసేసాడు"...camera మళ్ళి సెల్ లోకి జూమ్ అయింది "నాకు రేపు ఓకే కాని బ్రమరంబ లోనే చూద్దాం" అని రిప్లై ఇచ్చాడు sriku కి...
ఇప్పుడు ౩లొక్ view లో స్టొరీ రన్ అవ్తుంది....
అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాతి రోజు ఆఫీసు లో మెయిల్స్ ద్వార అందరిని అడిగాము ఎవరెవరు వస్తారని. మార్నింగ్ లేవగానే చూడకోడని మొహాలు చూసిన మరో ఇద్దరు (ఫణి,ఫణింద్ర) చేతులెత్తారు. ఎత్తిన చేతులు మెయిల్స్ ద్వారా మాకు కనపడవని పాపం వాళ్లకి తెలీదు అనుకుంట మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు. మేమే ఫోన్ చేసి మొత్తానికి ఆ ఇద్దరితో మాట్లాడి బకరా లవ్వడానికి రాత్రి తొమ్మిది కల్లా theatre కి చేరుకున్నాము. కాని బాల్కనీ అయ్పోయాయి. కష్టపడకుండానే 40/- టికెట్స్ దొర్కేసాయి. మా కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా టికెట్ కౌంటర్ మూసేసాడు మాకు టికెట్స్ ఇవ్వగానే. ఓ అరగంట అలా అలా తిరిగి expectations ఎలాగో లేవు కాబట్టి మూవీ ని ఎంజాయ్ చేయొచ్చని లోపలకేల్లాము.
40/- లో కింద నుంచి మొదటి row...అసలే స్క్రీన్ పెద్దగ ఉంటది..అక్కడి నుంచి చూస్తుంటే సినిమాలో ఒకేసారి ఏదన్న ఒక మూల మాత్రమె కనపడ్తుంది. జీవితం లో ఎప్పుడు ఈ view లోంచి సినిమా చూసి ఎరగను. నెల టికెట్ కి మాకు పెద్ద తేడా లేదు సీటింగ్ తప్ప...ఇంతలో మూవీ స్టార్ట్ ఐంది. రామ్ "నేను జీవితాంతం లవ్ చేయలేను కాని వరల్డ్ గ్రేట్ లవర్ నేనే" అంటున్నాడు. అసలే రామ్ చరణ్ ని స్క్రీన్ మొత్తం ఉంటె చూడటం కష్టం అలాంటిది నేల టికెట్ దగ్గరి నుంచి చూడటం ఎంత కష్టమో అనుభవిస్తే కాని తెలీదు. రామ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే అందులో జాను(జేనేలియా) వచ్చింది. theatre మొత్తం విస్సిల్స్. జాను over action చూసాక విస్సిల్స్ ఆగడానికి ఎన్నో సెకండ్స్ పట్టలేదు..అలా కొంత సేపు సినిమా నడిచాక రామ్ జాను కి సింహాన్ని చూపిస్తాడు. జాను "నేను సింహాన్ని చూసాను" అని ఆనందం తట్టుకోలేక గంతులేస్తుంది. ఆ ఆనందాన్ని wild photography మాత్రమె తీసే హీరో గారు camera లో బందిస్తారు(అందంగా కాదు చెత్తగా).అప్పుడే అర్థమయిపోయింది సింహ తర్వాత నేను రివ్యూ రాయవలసి వచ్చే సినిమా ఇది అవ్తుంది అని.
పోనీ సాంగ్స్ అన్నా బాగున్నాయా అంటే అదీ లేదు. "రూబ రూబ సాంగ్" తప్పితే మిగతావి అన్ని బోరింగ్ గా ఉన్నాయి చూడటానికి. డాన్సు కూడా జస్ట్ ఓకే. సాంగ్స్ అంతగా బోర్ కొట్టడానికి అతి ముఖ్య కారణం రామ్ చరణ్ మూతి. సాంగ్స్ కి లిప్ మొమెంట్ చేస్తుంటే ఎంత వద్దనుకున్న అదే కనపడ్తుంది. ఇంకా తన నవ్వుగురించి, జాను డ్రెస్సింగ్ గురించి అసలు చెప్పుకోకవడమే బెట్టేరేమో. పప్పీ(బ్రాహ్మి) నేమ్ బాగుంది కాని అసలు నవ్వే రాదు సినిమా చూస్తున్నప్పుడు. సినిమా అంతా ఆర్య నుంచి inspire అయ్యి ఒక నమ్మలేని కాన్సెప్ట్ నమ్మించడానికి ట్రై చేసినట్లుగా ఉండి గాని ఏం చెప్పాలనుకున్నాడో నాకు కూడా అర్థం అవలేదు...ఇన్ని bad things మద్య సెకండ్ హీరోయిన్ కొంచం బాగానే ఉన్నా కూడా మనసు accept చేయలేకపోయింది...
సినిమా లో ఏం చెప్పాలనుకున్నాడో director విఫలమయ్యాడు అనడానికి రామ్ చరణ్ డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ చాలు.
రామ్ చరణ్, జెని తో ప్రేమ గురించి ఇలా అంటాడు. " అందరి ప్రేమ ఎదురుగ వస్తున్నా vehicle లైట్స్ చూసి మన కార్ డ్రైవ్ చేయడం లాంటిది అంత...రామ్ చరణ్ ప్రేమ తన హెడ్ లైట్స్ చూసి డ్రైవ్ చేయడం లాంటిది అంత...తక్కువ దూరం కనపడిన సేఫ్ గా ఉంటామంట"...ఏం చెప్పాలనుకున్నాడో తనకే తెలియాలి...వాళ్ళక్క బావ కొట్టుకుంటుంటే కొట్టుకోడం ఎందుకు విదిపోమంటాడు...ఈడి psychoism ముందు అసలు ఆర్య - 2 psychone కాదు...లవ్ మీద మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఈ సినిమా ని చూడకపోవడమే మంచిది....
నాకే ఈ సినిమా సరిగా అర్థం అవలేదు అనడానికి చెప్పుకోడానికి సిగ్గుగా ఉన్నా తప్పడం లేదు....
చివరి మాట: ఈ సినిమా చూసాక కూడా ఖలేజ,రోబో,బృందావనం బాలేదన్న వాడిని వొంగో బెట్టి రబ్బర్ స్టంప్ తో వీపు మీద గిభి గిభి అని గుద్దినా తప్పులేదు...
1, డిసెంబర్ 2010, బుధవారం
26, నవంబర్ 2010, శుక్రవారం
అందమైనది ఈ జీవితం
చలి కాలం అయినందు వల్ల తెల్లవారుజామున ఆరు గంటలకు కూడా సూరీడు ఇంకా కనపడటం లేదు. ఆకాశం అంతా నారింజ రంగు పులుముకుంది. ఒక వైపు సూరీడు వస్తున్నా కూడా చందమామ కి వెళ్ళాలని అనిపించడం లేదనుకుంట సూరీడు అందాన్ని చూసి ఇంకా నిండుగానే ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఆకాశం లో పక్షులు చద్రుడిని అందుకేనేందుకు గుమౌగా అటు వైపే వెళ్తున్నాయి. కోకిల పాటలు కోడి కూతలు నా మనసుని మేల్కొలుపుతున్నట్లుగా తోస్తుంది. వరి చేను పసుపు మరియు ఆకు పచ్చ రంగులతో మెరిసిపోతుంది. పొగ మంచు వల్ల ఏర్పడిన నీటి బిందువులు చెట్ల ఆకుల చివరన ఉండి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనలో దాచుకుని ఆ ప్రపంచాన్ని కన్పించి కనిపించకుండా చాలా చిన్నగా చూపిస్తున్నాయి.పొగ మంచు వల్ల దూరంలో ఉన్నవేమి కనపడటం లేదు. ప్రపంచం అంచు ఇంకో పది అడుగుల దూరంలో ఉన్నట్లుగా ఉంది. నా కాళ్ళకు చెప్పులు లేకపోవడంతో చేను గట్టు మీద అక్కడక్కడ ఉన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడో సుప్రభాతం వినపడుతుంది కాని నా దగ్గర రేడియో లేదన్న ఆలోచన నాకు రావటం లేదు. సుప్రభాతం అయిపోయిన తర్వాత "లాహిరి లాహిరిలో", "అందమే ఆనందమే", " భలే మంచి రోజు" లాంటి పాత పాటలు పల్లవి వరకు వచ్చి మారిపోతున్నాయి. ఆ రోజేంటో అన్ని నాకు ఇష్టమయిన పాటలే వస్తున్నాయి రేడియో లో. ఆ సమయంలో అక్కడ చెప్పులు లేకుండా ఎందుకూ నడుస్తున్నానో ఏం చేద్దామని వచ్చానో నాకేమి గుర్తురావటం లేదు. అయినా కాని అలా ప్రకృతి ని చూస్తూ గమ్యం తెలీని దారిలో నడుస్తూ ఉంటె చాలా ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న కొలను దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాను. చుట్టూ మామిడి చెట్లతో చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం. కొలనులోని నీళ్ళు ఈ అందాన్ని చూస్తూ అలలు అలలుగా వస్తూ ఎగిరే చేప పిల్లలతో అతలాడుతున్నాయి.
అలా కొంత దూరం నడిచే సరికి ఒక రైల్వే స్టేషన్ కనపడింది. చందానగర్ స్టేషన్ అని రాసి ఉంది. మళ్ళి ఆలోచనలు మొదలయ్యాయి, హైదరాబాదు లో ఇంత అందమయిన ప్రదేశాలు అదీ చందానగర్ దగ్గరలో ఎలా వచ్చాయా అని. లోపలి వెళ్ళాను.స్టేషన్ అంత ఖాళీగా ఉంది. అక్కడక్కడ కొంత మంది మాత్రమె కనిపిస్తున్నారు. ఇద్దరు ముసలి వాళ్ళు ప్రేమికులల కబుర్లు చెప్పుకుంటున్నారు అవతలి ప్లాట్ ఫారం మీద. స్టేషన్ లో అన్నౌన్సుమేంట్ కి బదులుగా చందమామ రావే పాట వస్తుంది. ఒక అమ్మ వల్ల బాబు కి గోరు ముద్దలు తినిపిస్తుంది. బాబు వాళ్ళ నాన్నతో కలిసి ప్లాట్ ఫారం నీడ ఉన్న వేయింగ్ మెషిన్ లో బరువు చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మని కూడా బరువు చూసికోమని బలవంతపెడుతున్నారు. అమ్మాయిలకయినా అమ్మలకైన బరువు చూసుకోడం అంటే ఎప్పటికయినా భయమే కదా అందుకే వద్దని చిన్న పిల్లలా మారం చేస్తుంది. ఆ బాబు అన్నం తినను అన్నాడో ఏం అన్నాడో గాని అమ్మకు తప్పలేదు చివరకి. నాకు వినపడలేదు గాని అలా అనే ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది, చిన్న వయసులో తన పిల్లలకి అన్నం తినిపించడానికి ఏమయినా చేస్తారు అమ్మలు. వాళ్ళ అమ్మ రూపాయి బిళ్ళ వేస్తుండగా బాబు మెషిన్ మీద ఒక కాలు వేసాడు. ఒక 20-30 kg లు ఎక్కువగా చూపించడం తో ఆ బరువు చూపించే పేపర్ ను ఎవరికీ ఇవ్వకుండా ఇది పనిచేయడం లేదు అని వాదిస్తూ సరదాగా గొడవ పడ్తూ దాచేస్తుంది. ఎందుకు అంత చూపించిందో ఆ బాబు కి కాక నాకు మాత్రమే తెల్సు. అమ్మ నాన్న పిల్లలు ఇలాంటి మనవ సంబందాలు ఎంత బావుంటాయో అని అన్కుంటూ నవ్వుకున్నాను. ఇంతలో భారి వర్షం పడేలా కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. అప్పుడప్పుడే కొంచం కొంచం గా గుర్తు వస్తుంది. ఏదో ప్రశాంతతను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చానని. ప్లాట్ ఫారం మీద ఇందాక ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారో తెలీదు గాని ఎవ్వరు లేరు. అంత చీకటిగా అయ్పాయింది. ఏమీ కనిపించడం లేదు. కేవలం చిరు వర్షం లో తడిసిన మట్టి వాసన మాత్రమె వస్తుంది.
చీకట్లో కూడా దూరంగా ఏదో వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు మెల్లిగా నా దగ్గరకే వస్తున్నట్లుగా ఉంది. బహుశా ట్రైన్ వస్తుందేమో అనుకున్నాను. కాని ఇంత చలిలో కూడా మొహం చాలా వేడిగా అయ్పోతుంది. కాళ్ళ కింద భూమి మాయమయ్యి నేను అనంతమయిన శూన్యం లోకి పడిపోతున్నాను. ఎందుకు పద్తున్ననో తెలిసే లోగా తల నేలను బలంగా తగిలింది. కళ్ళు తెరిచి చూసే సరికి మంచ పక్కన ఉన్నాను. ఇదంతా కల అని, ఇందాక కలలో కనిపించిన వెలుగు కిటికిలోంచి పడ్తున్న ఎండా అని, శూన్యం లోకి పడింది స్టేషన్ లోంచి కాదు మంచం మీద నుంచి అని అర్థం అయ్యాయి. జీవితం లో ఎలాంటి చిన్న చిన్న ఆనందాలను,మనుషుల మద్య అత్మీయతలను కోల్పోతున్నామో అనుకుంటూ పైకి లేచి గడియారం చూసాను. సమయం తొమ్మిదిన్నర. ఈ రోజు కూడా ఆఫీసు కి గంట ఆలస్యం. పగటికలలు నిజమవ్తయన్న చిన్న ఆశతో తుమాలు పట్టుకొని యాత్రిక జీవనం లోకి పరుగు తీశాను.

15, నవంబర్ 2010, సోమవారం
పూ.జా.భా - 2
అలా పూణే లో దిగిన మాకు వింత వింత మనుషులు తారసపడటం మొదలెట్టారు. పూణే లో జనాలు అలా ఉంటారో లేకపోతె మేము దిగిన వేళా విశేషమో గాని ఎవడికి వాడు ఒక్కో రకం. ఆ రకాలలో కొన్ని ఇక్కడ...
ఒకటో రకం:
ఈ ఒకటో రకం గాడు పొరపాటున మా ఇంటి ఓనర్ అయ్యి చచ్చాడు గాని ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి డబ్ చేసే భూతాల దిబ్బ,దెయ్యాల కోట లాంటి సినిమాలకో డబ్బింగ్ చెప్కోవాల్సిన వాడు. నేను మాములుగా పెద్ద వాళ్ళను వాడు వీడు అనను కాని వాడంటే మా అందరికి మసాల పెట్టని మిరపకాయ బజ్జి అంత మంట. వాడు మాట్లాడటం మొదలు పెడ్తే ఒక పట్టాన వదిలేవాడు కాదు. పూణే వెళ్ళిన కొన్ని రోజులకి తెలిసిన వాడు రూము ఉందంటే నచ్చితే అడ్వాన్సు ఇద్దామని డబ్బులు కూడా తీస్కోని వెళ్ళాము. ఆ రోజు అలా పరిచయమవ్వగానే ఇంట్లోకి పిలిచి కూర్చోమన్నాడు. రూము చాలా లక్కీ అందులో ఉన్నవాళ్ళకి అని చెప్పి ఒక డైరీ ఓపెన్ చేసాడు. ఆ డైరీ లో అప్పటి వరకు ఆ రూం లో ఉన్న వారందరి పేర్లు రాసుకున్నాను అని చెప్పి డైరీ మాకిచ్చాడు చూడమని. ఆ డైరీ లో పేరు దానికి US లో జాబు, UK లో జాబు, జర్మనీ లో పెళ్లి అని రాసి పెట్టుకున్నాడు. అలా అందరి గురించి ఒక్కో ఐదు నిమిషాలు చెప్పి మెదడు ని మెత్తటి పకోడీ తిన్నట్లు తినేసాడు. హమ్మయ్య లిస్టు అంత ఇప్పటికి అయినా అయింది అనుకుంటుండగానే ఇల్లు తో పాటు మీకు furniture కూడా ఇస్తాను అనడు. తింటే తిన్నాడు గాని బ్రహ్మచారులకి fridge, TV set ఎవరు ఇస్తారు అని ఆనంద పడ్డాము. ఇల్లు చూపించాదంకి తీస్కెళ్ళాడు. ఇల్లు పర్లేదు బానే ఉంది. fridge చూపిస్తాను అని చెప్పి తుప్పట్టిన బీరువా తలుపు తెర్చాడు. TIDE ad లో తెలుపుదనం చూసి అవాక్కయినట్లు మేము అవాక్కయ్యాము. అది బీరువా కాదు fridgee. తుప్పట్టడం మూలంగా,లోపల కూడా ఎమన్నా పెట్టుకోడానికి అరలు లేకపోడం మూలాన తేడ పోల్చుకోలేకపోయాము గాని కేవలం చల్లగా ఉన్న కారణంగా అది fridge ayindi. సరేలే fridge తో పనేమీ ఉంటుందిలే అని Blue diamond( అలంటి టీవీ కంపెనీ కూడా ఒకటి చరిత్రలో ఉండేదని అప్పుడే తెల్సింది) టీవీ ఆన్ చేసాము. మరాఠీ ఛానల్ ఏదో వస్తుంటే ఛానల్ మార్చడానికి చూసేసరికి టీవీ స్క్రీన్ రావడం మానేసింది. అప్పుడు మా ఓనర్ ఇది చిన్న ప్రాబ్లంమే ఒక దేబ్బెస్తే వస్తుంది అని టీవీ ని దభా దభా నాలుగైదు పీకాడు. అదే మనిషి అయుంటే చావనన్న చచ్చేది లేకపోతె return గా రెండు పీకేది. వేరే ఇల్లేమీ కనపడక అదే ఇంట్లో తప్పక దిగాము. రోజు సాయంత్రం గేటు సౌండ్ రాగానే మా డోర్ దగ్గర కోచేసేవాడు మీ కంపెనీ గురించి నాకు తెల్సు నేను ఒక టైం లో software అనేవాడు, ఏం అయినా ప్రాబ్లం ఉంటె చెప్పండి నేను చూస్కుంటాను అని మాటలతో మా మైండ్ తినీసేవాడు. ఒక్కో సారి వండున్తున్న వంటలు మాడిపోతున్న కూడా వదిలేవాడు కాదు.
రెండో రకం:
జుట్టు బాగా పెరిగింది తర్వాతి రోజు నుంచి ఆఫీసు కి వెళ్ళాలి అని hair saloon కి వెళ్ళాము హెయిర్ కట్ చేయించడానికి. cutting చేయమని కూర్చున్నాము. వాడు నాకు మూడ్ లేదు అన్నాడు. వచ్చి రాని హిందీ లో నేను చెప్పింది అర్థం కాక అలా అన్నాడో లేక నేను తప్పుగా విన్నానో తెలీక పక్కన ఉన్నవాదిదో హెయిర్ కట్ చేయమని చెప్పించా. మళ్ళి మూడ్ లేదు అన్నాడు. ఇక్కడ hyderabad లో అయితే షాప్ కట్టేసే టైం అవ్తున్న కూడా ఎవరన్న వస్తే cutting చేసాకే షాప్ మూస్తారు. ఈడేంటి మూడ్ లేదంటాడు అని expression లేని షాక్ తో బయటికి వచ్చేసాము.
మూడో రకం:
మేము పూణే వెళ్ళిన కొత్తలో పొరపాటునో గ్రహపాతునో మా నలుగురిలో ఎవడికో అరటి పళ్ళు తినాలనిపించింది. మాలో ఒకడు అరటి పళ్ళ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆడ మనిషి అమ్ముతుంది. ఎంత అన్నము 20/- డజన్ అంది. సరే అని 10/- ఇచ్చి అర డజన్ ఇమ్మన్నాము. ఇవ్వనంది. డజన్ 20/- అయితే అర డజన్ 10/- కదా అన్నాము. అయతే అవ్వొచ్చు గాని నేను మాత్రం ఇవ్వను అంది. చేసేదేమీ లేక పూణే లో ఉన్నన్నాళ్ళు ఇంకోసారి అరటి పళ్ళ జోలికి వెళ్ళలేదు.
ఇలా ఎన్నో రకాలు కలిపి పూ.జా.భా - 2 . కుదిరితే ఇంకొన్ని రకాలు పు.జా.భా - 3 లో....

3, నవంబర్ 2010, బుధవారం
పూ.జా.భా-1
జూన్ 04,2008.
ఆ రోజు శనివారం. సమయం సాయంత్రం ఏడు దాటింది. బయట వర్షం భారీగా పది ఇప్డే కొంచం తగ్గింది. వర్షాలు ఎప్పడు మనం ఎక్కడికన్నా ప్రయాణం అయ్యేటప్పుడే పద్తుంటాయి. ఆ రోజు నేను పూణే కి బయలుదేరుతున్నాను capgemini లో ట్రైనింగ్ కోసం. మనసులో చాలా ఆందోళన గ ఉంది. ఆ ఆందోళనకు రెండు కారణాలు ఉన్నాయి.
నేను ఎప్పడు దూర ప్రయాణాలు చేయలేదు,రాష్ట్రం దాటి వెళ్ళను లేదు. వెళ్ళేది హిందీ మాట్లాడే రాష్ట్రానికి. నాకు ఎ మాత్రం హిందీ రాదు.అక్కడి వారితో ఎలా మాట్లాడాలో ఎలా బ్రతకాలో తేలేదు. ఇది మొదటి కారణం. పోనీ నాతో పాటు వచ్చే ఇంకో ముగ్గురి మీద ఆధారపడడం అంటే ఆ ముగ్గురే నా ఆందోళనకు రెండవ కారణం.
రాము,సోము,భీము(కొన్ని కారణాల వల్ల పేర్లు మార్చడం జరిగింది). ఈ ముగ్గురు నాతో పాటు ఒకే కాలేజీ లో ఓకీ తరగతి లో ఇంజనీరింగ్ చదివినా కూడా నాకు పెద్ద పరిచయం లేదు. ఒక విధంగా చెప్పాలంటే వీరు ముగ్గురు క్లాసు లో చివరి బెంచ్ బాచ్. నేనేమో చందానగర్ బాచ్. అంటే బుద్ధిగా ఉంది చదుకునే బాచ్ అని ప్రసిద్ది. వీళ్ళు నేను ఒకే కంపెనీ లో జాయిన్ అవ్త్నమని తెలసాక ఒకే చోట ట్రైనింగ్ తీస్కోవాలని అని తెలసాక అందరు భయపెడుతుందే వారు. నువ్వేమో సిలెంట్ వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటావో, నీ పని అయ్పాయింది లే అని.
ఈ ఆందోళనల మద్య బస్సు ఎక్కడానికి కుకట్పల్లి బస్సు స్టాప్ దగ్గరకి అమ్మ నాన్న అక్క బావ తో వచ్చాను. అయ్యబాబోయ్ ! ఆ ముగ్గురిని ఎక్కించడానికి కనీసం ముప్పై మంది వచ్చారు. గోల గోల చేస్తున్నారు. బస్సు వచ్చాక నేను సిలెంట్ గా వెళ్లి పైన బెడ్ మీదకి ఎక్కేసాను. ఆ ముగ్గరు బస్సు స్టార్ట్ అయ్యాక ఐదు నిమిషాలకు గాని రాలేదు. వచ్చి ఇంకో ఐదు నిమిషాలు కిటికీ లోంచి టాటా లు చెప్పి కూర్చున్నారు. ఆ బస్సు లో ప్రతి బెడ్ కి ఒక టీవీ ఉంది. హాయిగా వీళ్ళ గోల పట్టించుకోకుండా సినిమా చూసుకోవచ్చులే అంకున్నాను. కాని ఆనందం ఆవిరి అయ్పాయింది. హిందీ సినిమా పెట్టాడు. మార్చమని cleaner ని అడగితే పూణే వెళ్ళేటప్పుడు హిందీ సినిమా, పూణే నుంచి వచ్చేటప్పుడు తెలుగు సినిమా పెడతాను మార్చడం కుదరదని తెగేసి చెప్పాడు.
ఇంతలో సోముగాడు బ్యాగ్ లో నుంచి లాప్ టాప్ తీసాడు. ఆహా! వీడు ట్రైనింగ్ లోనే లాప్ టాప్ తెచ్చాడు సౌండ్ ఏమో అంకున్నాను. రాముగడు ఆ లాప్ టాప్ ని తీస్కోని అందులో DVD పెట్టాడు. అప్పుడు అర్థం అయింది అది మ్యుజియం లో ఉండాల్సిన తొలి తరం కంప్యూటర్ అని. DVD పెడ్తే ఉండదు ఆటోమాటిక్ గ బయటకి వచ్చేస్తుంది. అలా చూస్తున్నంత సేపు అలా పట్కునే ఉండాలి. ఐన రాము గాడు పట్టు వదలని విక్రమార్కుడిలా అలా పట్టుకునే సినిమా చూసేస్తున్నాడు. ఆ కస్టాలు చూసి నేను "అలా పట్టుకుని మూడు గంటలు సినిమా చూసే బదులు ఒక ఐదు నిమిషాలు పట్టుకుని సినిమా సిస్టం లోకి కాపీ చేస్కుంటే తర్వాత ఫ్రీగా చుస్కోవచ్చును కదా!" అన్నాను. ముగ్గురు అవాక్కయ్యారు. నా వైపు వింతగా వేరే గ్రహం నుంచి వచ్చిన జంతువును చూసినట్లు ఆశ్చర్యంగా చూసారు. ఏం తెలివి ఏం ఐడియా ఇచ్చావు నువ్ కేక అన్నారు. అది పెద్ద గొప్ప కష్టమైన ఐడియా ఏం కాదు వీల్లేంటి ఇంత పొగిడేస్తున్నారు అనుకున్నాను. నాకు ఆ ముగ్గురు "3D" అని నామకరణం చేయటానికి పురికొల్పిన మొదటి సంగటన అది.
అలా పూణే వెళ్ళేసరికి తెల్లారింది. బస్సు దిగి దిగగానే ఆటో వాడు మా లుగ్గాగే ఎత్తుకెళ్ళి ఆటో లో పెట్టేసుకున్నాడు. NIGDI వెళ్ళాలి ఎంత తీస్కుంటావు అన్నము. వాడు మీటర్ వేస్తాను అన్నాడు. అరె భలే మంచోల్లే పూణే లో ఆటో వాళ్ళు అని అన్కొని ఎలాగో luggage ఉంది ఆటో చీపుగానే ఉంది కదా అని రెండు ఆటో లు మాట్లాడుకున్నాం. ఆటో ఎక్కక స్టార్ట్ చేసాడు. ఆటో నడుస్తుంది కాని మీటర్ పరిగెడుతుంది. ఇంత ఫాస్ట్ గ తిరుగుతున్దేన్తయ్య అని వాడిని అడగితే ఒక పేపర్ చేతిలో పెట్టాడు. అందులో కిలో మీటర్ కి ఏంటో రాసి ఉంది. అది కూడా fake అని అప్పుడు మాకు తెలీలేదు. మొత్తానికి నిగడి లో దిగాక 250/- అయింది. రెండు ఆటోలకి కలిపి 500/- వాడి చేతిలో పెట్టాము. ఇంకో ఐదు వందలు ఇమ్మన్నాడు. అదేంటంటే, పూణే లో రాను పోను చార్జెస్ కూడా ఇవ్వాలి అన్నాడు. ఇవ్వము ఎక్కడ అలా ఉండదు అన్నము. వాడు ఇంకో ఇద్దరు ఆటో వాళ్ళని పిలిచి గొడవ చేయబోయాడు. మోసపోతున్నామని తెల్సి కూడా ఏమి చేయలేక 1000/- వాడి చేతిలో పెట్టాము. చదుకున్న వాళ్ళందరూ ఇలానే తెల్సి కూడా మోసపోతుంటారు. ఇక్కడ కు బయలుదేరక ముందు పూణే లో అమ్మాయిలు బాగుంటారని చెప్పిన వారందరినీ పేరు పేరునా గుర్తు చేసుకొని ఆటో వాళ్ళు బాగుండరు అని ఒక్కరయినే చెప్పలేదనుకొని ఏడ్వలేక నువ్వుకున్నాము. ఇది పూణే లో జాబు భాగం ఒకటి(పూ.జా.భా-౧).

22, అక్టోబర్ 2010, శుక్రవారం
పశ్చిమ గోదావరి పద సంపద...
నేను పశ్చిమ గోదావరి లో పుట్టాననే గాని అక్కడి బాష,యాస నాకు అబ్బలేదు. ఎందుకో నాకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమె చెందిన పదాలను యాసను తెల్సుకోవాలంటే అమిత ఆసక్తి. సరే నాకు నేను పుట్టిన ఊరిలో వాడే పదాలుఏ మాత్రం తెల్సో అని చుస్కుంటే అవి చాలా తక్కువే.
పుట్టిన ప్రాంతం లో ఎలాగో ఉండట్లేదు. అక్కడి పదాలను గుర్తుచేసుకున్తుంటే చాలా బాగుంది. అలా నాకు గుర్తుకు వచ్చిన వాటిలో కొన్ని...
దాక = కడాయి
బెడ్డ=రాయి
బెగ=త్వరగా
లాగించు=వెళ్ళు
బాల్చ=బక్కెట్
దడి= ప్రహరి
బాడి = బురద
బోదు=పిల్ల కాలువ
బెస్త వారం=గురువారం

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం
నా సైకిల్ ప్రయాణం...
నా స్కూల్ మా ఇంటి పక్కనే అవడం మూలనో లేక చిన్నప్పటినుంచి నేను మరీ సుకుమారంగా పెరగటం మూలానో నాకు చిన్నప్పుడు సైకిల్ తోక్కవలసిన అవసరం రాలేదు.అందుమూలంగానే సైకిల్ నేర్చుకోనూ లేదు. నాకు చిన్నప్పుడు సైకిల్ రానివలన సైకిల్ తోక్కేవాల్లందరూ యుద్ధం లో గుర్రమేక్కిన రాజుల లాగాను భారతంలోని అర్జుని లాగానో కన్పించేవారు.
అలా నాకు సైకిల్ మీద కలిగిన ప్రేమ వల్ల నాకు రాత్రిళ్ళు సైకిల్ గురించి కలలు కూడా వస్తుండేవి. ఆ కలల్లో ఆగస్ట్ పదిహేను ముందు జరిగే స్లో సైక్లింగ్ పోటీలలో నేను చేతులు వదిలేసి మరీ తొక్కుతున్నట్లు, అయినా కూడా నేను గెలుస్తున్నట్లు ఉండేది. నేను ప్రైజ్ తీస్కోడానికి స్టేజి ఎక్కినప్పుడు కింద ఉన్న పిల్లలంతా వీడికి సైకిల్ తొక్కడం వచ్చట అని gఉస గుస లాడుకున్తున్నట్లుగా,కేక కేక అని అరుస్తున్నట్లు అనిపిస్తూ ఉండేది...
నేను పదవ తరగతి కి వచ్చాక మొత్తానికి లేట్గా అయినా సైకిల్ నేర్చుకుందామని సంకల్పించుకున్నాను.సంకల్పించుకున్నదే తడవుగా ఒకానొక ఫ్రెండ్ యొక్క సాక్షి శివానంద్ ని అడిగి తీస్కున్నాను. సాక్షి శివానంద్ అంటే వాడి ఫ్రెండ్ కాదు, వాడి సైకిల్ కి వాడు పెట్కున్న ముద్దు పేరు. ఎవరు చుడకొడదని ఉదయం స్టడీ హావర్ మద్యన ఇచ్చే గ్యాప్లో చీకట్లోనే సైకిల్ నేర్చుకున్నాను.
అలా చీకట్లో నేర్చుకోవడం మూలాన ఎవరు చూడకపోవడం మూలాన నాకు సైకిల్ వచ్చని చెప్పినా కూడా ఎవరు నమ్మేవారు కాదు. అప్పుడు శివ సినిమాలో సైకిల్ చెయిన్ లాగే ముందు నాగార్జున కి వచ్చినట్లుగా కోపం వచ్చి వీలందరి నోళ్ళు మూయిన్చాలన్కున్నాను. ఈ రోజు ఎలాగయినా ఇంటికి సైకిల్ మీద వెళ్ళాలని సాక్షి శివానంద్ ని అడగి తీస్కున్నాను. పని ఏమి లెకపొఇన ఇంటికి వెళ్ళడానికి అని సాయంత్రం స్టడీ హావర్ గ్యాప్ లో సాక్షి శివానంద్ ని తీసి సైకిల్ తొక్కడం చాలా వీజీ అని మనసులో అన్కొని స్టార్ట్ చేసాను. బైక్ కదా స్టార్ట్ చేసేది సైకిల్ కూడా స్టార్ట్ చేస్తారా అని సందేహమా నా ఉద్దేశం లో స్టాండ్ తీసి సీట్ మీద ఎక్కడం స్టార్ట్ చేయడం. JNTU కాలేజీ లోని జవహర్ లాల్ నెహ్రు గారి విగ్రహం లాగ chest ముందుకు పెట్టి అలా అలా తొక్కుతూ ఉన్నాను. అప్పుడు నా కళ్ళ ముందు జంతికలు కనపడ్డాయి(తినే జంతికలు కాదు ఫ్లాష్ బ్యాక్ ముందు కనపడే జంతికలు). నాకు సైకిల్ రాదనీ అందరు అంకున్తుండగా నా హృదయానికి గుచ్చుకున్న బాణాలు గుర్తుకోచాయి. ఈ రోజు అమ్మ కి డాడ్ కి నేను సైకిల్ మీద వచ్చాను అని చెప్తున్న సంఘటన మనసులోకి రాగానే కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపాయింది. ఆ ఆనందం లో సైకిల్ తో నాకు రాని కట్ కొట్టబోయి ఇంకో సైకిల్ ని గుద్దాను. అది మాములు సైకిల్ అయి ఉండుంటే ఈ టపా రాసేవాడినే కాదేమో.అది గుడ్లు అమ్ముకునే వాడి సైకిల్ అది. ఒక వంద దాక గుడ్లు rythamicgaa కింద పడిపోయి పగిలిపోయాయి. వాడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ లగేస్కుని మొత్తానికి సాక్షి శివానంద్ ని వదిలి పెట్టాడు. దానితో నాకు సైకిల్ వచ్చు అన్న నిజం భూస్థాపితం అయిపొయింది.
మళ్ళి Btech లోకి వచ్చాక మా ఊర్లో తొక్కుకుంటూ వేరే ఊరు వెళ్లి వచ్చేటప్పుడు కింద పడ్డాను. దెబ్బలు బానే తగిలాయని బాధపడాలో దెబ్బలు తగిలితేనే సైకిల్ వచ్చినట్లు అని అందరు అంటుంటే ఆనందపడాలో నాకు అర్థం అవ్వలేదు.

3, ఆగస్టు 2010, మంగళవారం
జ్వరం
జ్వరం వస్తే భాలేగా ఉంటుంది...ఇప్పుడు ఆ జ్వరాన్ని జ్వరంలాగే చూస్తున్నాను కాని నా చిన్నప్పుడూ అదొక పండగ అదొక ఆనందకరమయ్న రోజు....ఎంచక్కా స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండొచ్చు...అబ్బా భలేగా ఉంటుది..ఇదివరకే చెప్పను కదా నేను చదువుకున్న స్కూల్ మా ఇంటి ప్రక్కనే ఉండేది అని...అప్పుడు జ్వరం వస్తే నేను మిద్దె పైకి ఎక్కి స్కూల్ లో పిల్లలని చూసి ఆనందపదేవాడిని...వళ్ళంతా స్చూల్లో ఉన్నారు నేను మాత్రం ఇంట్లో ఉన్నాను అని...అదొక sadism ఆ రోజుల్లో....ఇంకా జ్వరం వల్ల వచ్చే plus లు కూడా బాగుండేవి...ఎంచక్కా బ్రెడ్ పాలు తినొచ్చు....జ్వరం మనకి వచినప్పుడు తినమంటే కష్టం కాని ఎవర్కన్న జ్వరం వచినప్డు వాళ్లకి తెచిన బ్రెడ్ తింటే భలేగా అన్పిస్తుంది...అలాగే కొంచం జ్వరం తగ్గాక అమ్మ చేసిన చారు వేసుకొని వేడి వేడి అన్నం తినొచ్చు..routine గా అందరు అన్నం తినే టైం లో మనం ఇడ్లీ తినేయోచ్చు....ఇంకా ఇంట్లో thermameter ఉంటె temperature చూస్కుంటూ ఆడుకోవచ్చు అలా గడిపీయోచ్చు...ముసుగు తన్ని పడుకోవచ్చు...ఎవరు లేపరు పగలంతా పద్కున్న కూడా...అప్పట్లో జ్వరం వస్తే tablets వేస్కున్నా వెస్కొకపొఇన అలా రెండు రోజులు ఉండి వేల్లిపోయీది....జ్వరం వచ్చినప్పుడు కలిగే బాధ కంటే మనల్ని జాగ్రత్తగా చూస్కునే అమ్మ నాన్న అక్క అన్నయ్య ఉన్నారనే ఆనందమే ఎక్కువగా ఉండేది..
కాని ఈ రోజుల్లో జ్వరానికి మనకి ఉన్న అనుభందం తగ్గిపాయిందేమో అనిపిస్తుంటుంది....దానికి మనకి మద్య సాన్గిత్యం చెడింది...ఇప్పుడు జ్వరం వస్తే ఒక పట్టాన తగ్గటం లేదు..జ్వరం వచ్చిన కూడా ఆ బ్రెడ్ ఇడ్లీ చారు అన్నం పెట్టడానికి అమ్మ ఉండట్లేదు మనం ఇంట్లో ఉండట్లేదు..ఎవరు ఉండనంత దూరం లో ఉద్యోగం వేలగాపెట్టడం వల్ల కోల్పోయే వాటిలో అవొకటి...ఈ రోజుల్లో అందరు ఫోన్ చేసి ఎలా ఉంది అనయ్తే అడగగలరు కాని మన దగ్గర ఉండి బాగోగులు అయతే చూడలేరు కదా...జ్వరాన్ని డాక్టర్ కంటే మనకి దగ్గరైన వాలే త్వరగా తగ్గించగలరు ప్రేమతో ఆప్యాయతతో ....
ఇదంతా ఎందుకురా రామ కృష్ణా అంటే నాకు చిన్నపాటి జ్వరం వచ్చి ఎంచక్కా ఆఫీసు కి ఎగనామం పెట్టి కాళిగా ఇంట్లో కూర్చుని ఉంటె వచ్చిన ఆలోచనలు....

8, జులై 2010, గురువారం
పాటలోని మాధుర్యం
సంగీతం లోని మాడుర్యానికి తెలుగు పదాలను కలిపి పాడిన పాటలు మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాంటి కొన్ని పాటలు వింటుంటే అలసిన శరీరానికి చల్లని సాయంత్రపు గాలి తగిలినట్లుగా ఉంటుంది. ఉదాహరణకు 'లాలి లాలి అను రాగం' అనే ఇందిరా చిత్రం లోని పాట వింటుంటే వెన్నెల రాత్రిలో ఇంటి పైన చాప ఏసుకొని పడుకొంటే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది. అలానే కొన్ని పాటలు వింటుంటే పాటలోని ఆంతర్యం అర్థం కాకపోయినా అలానే హాయిగా ఉంటుంది. 'శశివదనే శశివదనే' అనే పాటలో ని భావం నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవలేదు. అయినా బాగుంటుంది. ఎందుకూ అంటే నాకు కూడా తెలీదు. భహుశా అందులోని స్వరాలను జోల పాటలనుంచి తీస్కున్నరేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. బోయ్స్ చిత్రంలోని 'సరిగమే పదనిసే' పాట వింటుంటే మనకి పాడటం రాక పాయిన పాడాలనిపిస్తుంది. సత్య చిత్రం లోని 'గాలిలోనే మాటి మాటికి' పాట వింటుంటే మనసు గాల్లో తేలుతూ ఉంటుంది. గోదావరి లోని 'మనసా వాచా నిన్నే తలచా' అనే పాట వింటుంటే గోదావరి గట్టు మీద ఇసుక తిన్నెల్లో ఒక సాయత్రం గడిపినంత ఆనందం గ ఉంటుంది. ఈ పాట లో సంగీతం కంటే వేటూరి గారి పదాలతో ఆటలే ఆ పాటకు అందం.
ఇవన్నీ రూపాయి కి ఒక వైపు అయతే వీటికి ఇంకో కోణం కూడా ఉంటుంది. అలంటి కొన్ని పాటలను వింటుంటే జీవితం మీద విరక్తి పుట్టి అసలు ఎందుకూ బ్రతుకుతున్నామా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది.మనమే ఒక కీ బోర్డు మరియు ఒక వీణ తీస్కుని సంగీతం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. విరక్తి అనగానే నాకు మొదట గుర్తు వచ్చేది మన అభిమాన సంగీత సామ్త్రాట్ XXX గారు. దేశముదురులోని 'సత్తే సత్తే' పాట వింటుంటే నిజంగానే అలా అన్పించేస్తుంటుంది. కొంత మంది కి ఈ పాట నచుతుంటుంది కాని నాకు మాత్రం అసలు నచ్చదు. ఆ పాట పెట్టిన వాడికి ఆర్ నారాయణమూర్తి చిత్రాలను IMAX స్క్రీన్ మీద చూపించాలన్న కోపం వస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మొన్నీ మద్య చందానగర్ లో తిరుగుతూ ఉంటె ఎక్కడ చూసిన మన అభిమాన సంగీత దర్శకుడి జన్మ దిన శుభాకాంక్షలు అని చాలా పోస్టర్స్ అంటించారు. అబ్బా తనకి అభిమానులు కూడా ఉన్నారా అనుకోని, కలి కాలం కదా లోకులు ఇలానే ప్రవర్తిస్తారు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కొంత మంది సంగీత దర్శకులను చుస్తే విరక్తి వస్తే కొంత మందిని చూస్తె నవ్వు వస్తుంది నాకు. ఆర్ పీ పట్నాయక్ గారు స్వర కూర్చిన చిత్రం 'నిజం' లోని 'రాముడమ్మ రాముడు' పాట గుర్తుకు వస్తుంది.ఆ పాటలో నవ్వు కల్గించేది ఎం లేకపోయినా నవ్వు వస్తుంటుంది. కాని తనే సంగీతం లోంచి వచ్చిన సంతోషం లోని 'ఏమైనదో ఏమో నాలో' అన్న పాట వింటుంటే నాలోనే ఏదో అయ్పోతుంటుంది. అంత బాగుంటుంది.
రాత్రి బస్సు లో ప్రయాణిస్తున్నప్పుడు బయట వర్షం పడతుండగా బస్సు అద్దాలపై వేలితో బొమ్మలు గీస్తూ పేర్లు రాస్తూ ఏం మాయ చేసావే లోని 'వింటున్నావా వింటున్నావా' పాట వింటుంటే కలిగే హాయిని మాటల్లో వర్ణించడం కూడా కష్టమే సుమీ....
ఎక్కడో విన్నాను కొన్ని పాటలను వింటుంటే గొంతులో తేనే పోసినట్లుగా ఉంటుందని నిజమే మరి....

6, జులై 2010, మంగళవారం
విజయం కూడా బాధ ని మిగులుస్తుంది...
విజయం కూడా బాధ ని మిగులుస్తుంది...
అనగనగ ఒక రాజ్యం ..చాల ప్రశాంతంగా సాగిపోతుంది ఆ రాజ్యం లోని ప్రజల జీవితాలు .ఎపడు ప్రశంతమగా ఉంటె ఎం బాగుంటుంది అంకున్నదేమో ఆ భగవంతుడు ఆ రాజ్యం లో రాజు కి ఒక ఫ్రెండ్ ని ఇచ్చాడు ..కానీ మిత్రుదనుకున్న ఆ సామంత రాజే ఆ రాజు రాజ్యాన్ని పొందాలని దండెత్తాడు ..రాజ్యం లో ప్రజలందరూ సమరంలో పాల్గొన్నారు .మన రాజే గెలిచాడు ..విజయం తనది ఐంది కానీ తన వాళ్ళందరిని కోల్పోయాడు ...విజయంలో ఎప్పుడు మాదుర్యం ఉండదు ...ఈ కదా న చిన్నప్పడు ఎక్కడో చదివా ....ఇప్పుడు ఆ రాజు పరిస్టిదే నాది కూడా ...మా team అంట Pune కి షిఫ్ట్ అయ్పోతుంది ..టీం అవ్తుంది కాని మెంబెర్స్ కాదు ..ఇక్కడ ఉన్న మెంబెర్స్ అందర్నీ రిలీజ్ చేసి పూణే లో కొత్త టీం ఫోరం
అవ్తుంది ...నన్ను కూడా అడిగారు pune వెళ్తావ అని ..వెళ్ళను అని అన్నాను ....అయతే నువ్ ఒక్కడివే ఇక్కడనుంచే వర్క్ చెయ్ అన్నారు ...టీం అంత రిలీజ్ అయపోతుంది కొన్ని రోజులలో ..నేనొక్కడినే ఇక్కడ ఉండేది ..ఒకే టీం గా ఉన్నప్పుడు తేలీలేదు ఒకరి బాధ మనకి కూడా బాధ కల్గిస్తుంది అని...అందుకే అంటారు పైకి కనపడని కొన్ని బాంధవ్యాల విలువలు విడిపోతేనే కాని అర్థం కావని ...నేను కూడా ఓడిపోయి అందర్తో ఉండిపోతే బాగుoడేది అనిపిస్తుంది ..ఒక్కోసారి సరి విజయం కూడా బాధ ని మిగులుస్తుంది...
Collapse this postEdit

స్క్ర్యూ డ్రైవర్
చిన్న పిల్లలకి స్క్ర్యూ డ్రైవర్ కి ఏదో సంబంధం ఉండి ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు దేనితో ఆయన కాసేపే ఆడుకుంటారు తర్వాత అందులో ఎం ఉంటుందో అన్న ఉత్సాహం అనుకుంట దానిని పీకి పాకన పెట్టె వరకు ఊరుకోరు.
మొన్నీమధ్యన ఒక పిల్లాడిని చూసా. బుల్లి కార్ తో అడుకున్త్నాడు పరిగేద్త్నాడు. ఇంతలో ఎం అయిందో ఏమో ఆ కార్ ని కిందేసి కొట్టాడు. ఎందుకురా అంత మంచి గ ఆడ్కునేవాడు అలా చేసాడా అని వాడిని దగ్గరికి తీసుకొని అడగితే ఎం ఉందొ అందులో చూద్దామని తీసాను అని చెప్పుకొచ్చాడు.అది వింటే నేను చిన్నప్పుడు అంటే ఐదవ తరగతి చదువుతున్నపుడు చేసిన ఒక తుంటరి అమాయకపు పని ఒకటి గుర్తు వచ్చింది.
నేను ఐదవ తరగతి చదువుతున్న రోజులవి. నేను చదివిన పా2(ట)శాల(స్కూల్..రెండవ 'ట' అనేది జిమెయిల్ లో లేనట్లుంది) మా ఇంటి పక్కనే ఉండేది. మా ఇంటి గోడ దూకితే స్కూలు, స్కూల్ గోడ దూకితే మా ఇల్లు. స్కూల్ అంటే అదొక ఇంద్ర భవనం కాదు. చాలా చిన్నదిగా ఉండేది. మట్టి గోడలు పైన తాటి ఆకులూ లేక కొబ్బరి ఆకులు ఉండేవి. ఆ రోజుల్లో మాకు ఎండా కలం ఒక్క పూట బదులు ఉండేవి. మరి వర్షా కాలం ఆ పూట కూడా ఉండేవి కాదు వర్షం పడితే. వర్షం పడితే సెలవు ఇచేసేవారు ఆ రోజుల్లో మాకు.
ఒక రోజు అలా వర్షం పడ్తుంటే మధ్యాహ్నం నుంచి ఇంటికేల్లిపోమన్నారు. నేను చెంగు చెంగు మని ఎగురుకుంటూ ఆనందం ఇంటికి వెళ్ళిపోయాను. రోజు వర్షాలు పడ్తుంటే ఆ రోజు మాత్రమే ఎందుకు చెంగు చెంగున ఎగరటం అని మీకు అనిపించి ఉండవచు కాని నాకు ఆ రోజుల్లో అనిపించలేదు. ఎందుకంటే ఆ ముందు రోజే మా నాన్నగారు కొత్త గణన యంత్రం(కాలేక్యులటర్ ) ఒకటి కొనుక్కొని వచ్చారు. అది చుస్తే బహు ముచ్చటగా ఉండేది. కాలేక్యులటర్ అంటే ఇప్పటిల scintific అనుకునేరు అది కేవలం కూడికలు తీసివేతలు గుణింతాలు మాత్రమే చేసేది. దానికి అన్ని లెక్కలు ఎలా వచ్చా అని నాకు తెల్సేది కాదు. ఈ రోజు ఎలాగో స్కూల్ లేదు కదా అందులోను డాడ్ కూడా ఇంట్లో లేరు ఆ గణన యంత్రపు రహస్యం ఏమిటో చేదించాలి అని మా స్కూల్ గోడ దూకుతుండగా అంకున్నాను.
అమ్మ పక్కన ఇంట్లో ఉన్న ఆంటీ తో మాట్లాడ్తుంది. నేను మెల్లిగా స్క్ర్యూ డ్రైవర్ తీసా. కాలేక్యులటర్ లోపల ఎం ఉందొ తెల్సుకుందామని తీసాను. లోపల కనపడే వాటిలో ఏవి కూడా నాకు అన్ని లెక్కలు చేస్తాయని అన్పించలేదు. డిస్ప్లే కోసం ఉన్న స్ట్రిప్ లో ఏదో ఉండి ఉంటుంది అంకున్నాను. ఉన్న ఉన్దెకపొఇన అది తీసి చూద్దామన్న ఉత్సాహం కల్గింది. ఆ ఉత్సాహానికి కూడా కారణం లేకపోలేదు. ఆ కాలేక్యులటర్ లో ఉండే డిస్ప్లే స్ట్రిప్ ని నొక్కితే చాలా రంగులు కనపడేవి. ఆ రంగులు లోపల ఎలా వస్తున్నాయన్న సందేహం కూడా నా ఉత్సాహాని కి ఒక కారణం అయి ఉండవచ్చు. మొత్తానికి దానిని కూడా తీసేసాను. కాని ఏమి కనపడలేదు నా సందేహాలు తీరలేదు కాని కొత్త చిక్కు వచ్చి పడింది. మల్లి దానిని యదవిదిగా పెట్టడం నా వాళ్ళ కాలేదు. ఇది చెప్పిన మాట ఎలాగో వినట్లేదు ఇక బాల ప్రయోగం చేయాల్సిందే అని సంకల్పించుకున్నాను. వెంటనే ఆ స్ట్రిప్ ని అది ఉండవలసిన ప్లేస్ లో పెట్టి మంచం కోడుకి గట్టిగ నొక్కాను. అందులో రంగులు గ్లాస్ మీద పగుళ్ళు మా డాడ్ వేసే విమానపు మోత దెబ్బలు నెత్తి మీద చుక్కలు అన్ని ఒక్క సరిగా కనిపించాయ్. అది ఎన్ని వేల రూపాయలు పెట్టి కొన్నారు తెలీదు నాకు. దెబ్బలు తప్పవని అర్థం అయిపొయింది. కొన్ని రోజులు ఆయన పోస్ట్ పోనే చేద్దామని దానిని పేపర్ లో చుట్టేసి పాత పుస్తకాల వెనక పడేసా.
అలా కొన్ని రోజులు గడిచిపాయింది. నేను కూడా దాని గురించి మరిచిపోయాను. ఒకానొకరోజు స్కూల్ నుంచి రాగానే డాడ్ చేతిలో ఆ గణన యంత్రము కనపడింది. ఎలా దొర్కిందో అర్థం అవ్వలేదు. డాడ్ అడగారు దీనిని ఎం చేసావురా అని.
భయం భయంగా చెప్పా అందులో ఎం ఉందొ తెల్సుకుందామని విప్పాను పెట్టడం రాలేదు అని. ఎంత రేటు ఉంటుందో చెప్పండి నేను పెద్దయ్యాక నా మొదటి జీతంతో అదే కొంటాను అని. అందరు నవ్వారు ఎంత రేటు ఉంటుందో చెప్పకుండా. హమ్మయ్య దేబ్బలయ్తే తప్పాయని ఆనందపడ్డ కాని ఎందుకు నవ్వారో మాత్రం అర్థం అవలేదు:(
నోట్: Posts that i have written will start with the header "Raining in my heart" ( నేను నా కలం నుంచి జాలువారే టపా లకు పెట్టుకున్న ముద్దు పేరు..కలం కాదేమో కీ బోర్డుకి పెట్టిన పేరేమో).
Hope to recieve ur feedback(pluses and minuses) or suggestions to improve my future writings.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)