జ్వరం వస్తే భాలేగా ఉంటుంది...ఇప్పుడు ఆ జ్వరాన్ని జ్వరంలాగే చూస్తున్నాను కాని నా చిన్నప్పుడూ అదొక పండగ అదొక ఆనందకరమయ్న రోజు....ఎంచక్కా స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండొచ్చు...అబ్బా భలేగా ఉంటుది..ఇదివరకే చెప్పను కదా నేను చదువుకున్న స్కూల్ మా ఇంటి ప్రక్కనే ఉండేది అని...అప్పుడు జ్వరం వస్తే నేను మిద్దె పైకి ఎక్కి స్కూల్ లో పిల్లలని చూసి ఆనందపదేవాడిని...వళ్ళంతా స్చూల్లో ఉన్నారు నేను మాత్రం ఇంట్లో ఉన్నాను అని...అదొక sadism ఆ రోజుల్లో....ఇంకా జ్వరం వల్ల వచ్చే plus లు కూడా బాగుండేవి...ఎంచక్కా బ్రెడ్ పాలు తినొచ్చు....జ్వరం మనకి వచినప్పుడు తినమంటే కష్టం కాని ఎవర్కన్న జ్వరం వచినప్డు వాళ్లకి తెచిన బ్రెడ్ తింటే భలేగా అన్పిస్తుంది...అలాగే కొంచం జ్వరం తగ్గాక అమ్మ చేసిన చారు వేసుకొని వేడి వేడి అన్నం తినొచ్చు..routine గా అందరు అన్నం తినే టైం లో మనం ఇడ్లీ తినేయోచ్చు....ఇంకా ఇంట్లో thermameter ఉంటె temperature చూస్కుంటూ ఆడుకోవచ్చు అలా గడిపీయోచ్చు...ముసుగు తన్ని పడుకోవచ్చు...ఎవరు లేపరు పగలంతా పద్కున్న కూడా...అప్పట్లో జ్వరం వస్తే tablets వేస్కున్నా వెస్కొకపొఇన అలా రెండు రోజులు ఉండి వేల్లిపోయీది....జ్వరం వచ్చినప్పుడు కలిగే బాధ కంటే మనల్ని జాగ్రత్తగా చూస్కునే అమ్మ నాన్న అక్క అన్నయ్య ఉన్నారనే ఆనందమే ఎక్కువగా ఉండేది..
కాని ఈ రోజుల్లో జ్వరానికి మనకి ఉన్న అనుభందం తగ్గిపాయిందేమో అనిపిస్తుంటుంది....దానికి మనకి మద్య సాన్గిత్యం చెడింది...ఇప్పుడు జ్వరం వస్తే ఒక పట్టాన తగ్గటం లేదు..జ్వరం వచ్చిన కూడా ఆ బ్రెడ్ ఇడ్లీ చారు అన్నం పెట్టడానికి అమ్మ ఉండట్లేదు మనం ఇంట్లో ఉండట్లేదు..ఎవరు ఉండనంత దూరం లో ఉద్యోగం వేలగాపెట్టడం వల్ల కోల్పోయే వాటిలో అవొకటి...ఈ రోజుల్లో అందరు ఫోన్ చేసి ఎలా ఉంది అనయ్తే అడగగలరు కాని మన దగ్గర ఉండి బాగోగులు అయతే చూడలేరు కదా...జ్వరాన్ని డాక్టర్ కంటే మనకి దగ్గరైన వాలే త్వరగా తగ్గించగలరు ప్రేమతో ఆప్యాయతతో ....
ఇదంతా ఎందుకురా రామ కృష్ణా అంటే నాకు చిన్నపాటి జ్వరం వచ్చి ఎంచక్కా ఆఫీసు కి ఎగనామం పెట్టి కాళిగా ఇంట్లో కూర్చుని ఉంటె వచ్చిన ఆలోచనలు....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి