27, ఆగస్టు 2014, బుధవారం

నేనెంత ఎదవనో నాకే తెలీదు


 
[ఈ పోస్ట్ లో పాత్రలన్నీ కల్పితం. ఈపోస్ట్  లోని మరణాలకు గాని డైరెక్టర్ రాం భూపాల్ శర్మ కి ఎటువంటి సంబంధము లేదు.]
[No Animals were harmed while writing this story.]
 
సీన్ 1:
          నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో, చాన్నాళ్ళ తర్వాత ఆదివారం ఇంటికి వెళ్ళాను. అమ్మ చికెన్ బిర్యాని చేసి పెట్టింది. నేను సుష్టుగా భోజనం చేసి ఓ తెలుగు సినిమా అంత లెంగ్త్ స్లీప్ ఏసాను. సాయంత్రం లేచి మళ్ళి హాస్టల్ కి బయల్దేరుతూ “అమ్మ మార్నింగ్ చేసిన బిర్యానీ ఉందా?” అని అడిగా. కొంచమే ఉంది టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తాను వెళ్ళాక తిను అంది. (చిన్నప్పడు పొద్దున్నే 6కి కోడి కూస్తే చిర్రెత్తుకోచ్చేది కాని మద్యాహ్నం అదే కోడి కూరగా మారి చాలా రుచిగా ఉండటంతో చికెన్ మీద చాలా మమకారం పెరిగింది నాకు). “ఎంత తక్కువ ఉన్నా చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అవదుగా! అదే బాక్స్ లో పెట్టి ఇచ్చేయ్” అన్నాను. అమ్మ రెండు బాక్స్ లు పెట్టి ఇచ్చింది. ఇదేన్టమ్మ రెండో బాక్స్ అని అడగితే ఆలూ కూర అని చెప్పింది. “అమ్మా,మనిషన్న వాడు ఎవడన్నా చికెన్ బిర్యానీ లోకి ఆలూ కూర ఏస్కుంటాడా? తీసేయ్ ఈ కూర” అని అమ్మ చెప్పేది వినకుండా బాక్స్ తీసి అమ్మకి ఇచ్చేసి హాస్టల్ కి వచ్చేసాను.
రాత్రి తిందామని బాక్స్ ఓపెన్ చేస్తే బిర్యానీ ఉంది కాని అందులో చికెన్ లేదు. అప్పుడు తెలిసింది అమ్మ ఎందుకు ఆలూ కూర పెట్టిందో. కాని ఒక విషయం తెలీలేదు....అదేనండి...నేనెంత ఎదవనో.
కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ ఏస్తే..
సీన్ 2:
          అది ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో టీవీ చూసే రోజులు. స్కూలులో సాయంత్రం స్టడీ హవర్స్ ఉండటం వలన మద్య రాత్రి వరకు స్కూల్ లోనే ఉండేవాడిని. ఓ రోజు వర్షం బాగా కురవడం తో కప్పలు బాగా అరవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. అదే టైం లో నా మైండ్ లొ ఒక ఆలోచన కూడా వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్స్ చెవులలో చెప్పాను. వాళ్ళు కూడా నా ఐడియా విని చాలా ఎక్సైట్ అయ్యారు. స్టడీ హావర్ అయిపోయి అందరు వెళ్ళే వరకు ఆగి ఆ తర్వాత ప్యాంటు పైకి మడతపెట్టి కప్పల కోసం వెతకడం మొదలెట్టాం. అలా మేము కప్పల వెంట పడ్డాం. ఏనుగు విష్ణుమూర్తిని వేడుకున్నట్లు ఆ కప్పలు మా ప్రిన్సిపల్ ని వేడుకున్నాయో ఏమోగాని మా ప్రిన్సిపల్ మా కళ్ళెదుట ప్రత్యక్షమయ్యాడు.
“ఏరా ఏమి చేస్తున్నారురా!” అన్నాడు మా ప్రిన్సిపల్.
“.....”ఎవరము ఏమి మాట్లాడలేదు.
మా ఫ్రెండ్ వీపు మీద ఒక మెరుపు మెరిసింది. ఆ దెబ్బకు వాడు కప్పలు పడుతున్నామని చెప్పేసాడు.
“ఎందుకురా కప్పలు” అని అడిగాడు మా ప్రిన్సిపల్.
మళ్ళి వాడి వీపు మీద మరో మెరుపు మెరవడంతో నేను ఒక ఐడియా ఇచ్చానని చెప్పేసాడు.
మా ప్రిన్సిపల్ నా దగ్గరకి వచ్చి ఎంటా ఐడియా అని అడిగాడు.
“కప్పల beep** ని ప్రాక్టికల్ గా తెలుసుకుందామని పట్టుకున్టున్నాం సార్” అన్నాను.
అప్పుడు మా ప్రిన్సిపల్ కి అర్థం అయింది. కాని నాకర్థం కాలేదు. మళ్ళి చెప్పడం ఎందుకులేండి title మళ్లో సారి చదువుకోండి.
** anatomy అని ఇంగ్లీష్ వర్డ్ వాడితే గౌరవం గా ఉంటుంది గాని నిజం చెప్పాలంటె actual గా ఆ రోజు ఆ కప్పలు ఆడా మగా తెల్సుకోడానికి ప్రయత్నించాము అని స్కూల్ లో ఆ తర్వాత టాక్. నేనేప్డు ఆ వాక్యాల్ని ఖండించలేదు కూడాను.
కత్తిరిస్తే...
సీన్ 3:
ఒక రోజు రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ సినిమా కి వెళ్లి వస్తున్నాను. బాగా లేట్ అవడంతో ఇంటికి వెళ్ళడానికి ఆటోస్ గాని బస్ గాని లేకపోవడముతో నడిచి వెళ్ళిపోదామని అనుకున్నాము. అది హిందీ సినిమా అవడముతో నాకేమి అర్థం అవక చాలా చిరాకుగా ఉండింది. దానికి తోడు రెండు కిలోమీటర్ లు నడవాల్సి రావడముతో నా తిక్క తిరుపతి కొన్డేక్కింది. నా ఫ్రెండ్స్ హిందీ సినిమా గురించి మాట్లాడ్కుంటూ ముందు నడుస్తున్నారు. నేను వెనక మెల్లగా నడుస్తున్నాను. ఒక వీధి కుక్క నా వైపు అదోలా చూస్తూ అరుస్తుంది. నాకసలే తిక్కగా ఉంది దాని అరుపు కి చిరాకేసి బెదిరించాను. అది వెనక్కి తగ్గలేదు. నేను రోడ్ మీద ఉన్న రాయి తీస్కుని దాని వెనక పరిగెత్తాను. తిక్క కుక్కనే పరిగెత్తించిన నా తిక్క ని చూసి గర్వపడి నా చేతిని కాస్త మడిచి నా భుజం మీద తట్టి శభాష్ అనుకున్నాను. అదే విషయాన్ని మా ఫ్రెండ్స్ కి చెప్తే tide ad లో తెల్ల చొక్కాని చూసి అబ్బురపోయినట్లు నన్ను చూసి చాలా గర్వపడ్డారు. అలా కాస్త ముందుకి వెళ్లి సందు తిరిగేసరికే వాళ్లకి అర్థం అయిపోయింది నేనెంత ఎదవనో. ఆ తిక్క(నా) కుక్క ఎలా చెప్పిందో తెలీదు కాని ఒక పది కుక్కలు మాకోసమే ఎదురుచుస్తున్నట్లున్నాయి, మేము సందు తిరగాగానే మా వెంట పడ్డాయి. మేము పిచ్చి కుక్కల్లా పరిగెత్తి మొత్తానికి బొడ్డు చుట్టూ ఏ ఇంజక్షన్ లేకుండా ఇంటికి చేరాము. మళ్ళి title ఒక సారి చదువుకోండి.
ఈ పోస్ట్ ముగించే ముందు మీకొక నీతి కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి...అదే చదవండి..ఎందుకంటే చివర్లో ఈ కథ లో నీతి (moral) ఏంటో చెప్పిన వాళ్లకి తగిన బహుమతి కూడా ఉంటుంది.
అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక ఏనుగు ఒక చీమ ఉండేవి. ఆ రెండు బెస్ట్ ఫ్రెండ్స్. (మీలో తెలివి కొంచం తక్కువ ఉన్నవాళ్ళు చీమ, ఏనుగు ఫ్రెండ్స్ ఏంటి విడ్డూరం అనుకొనుంటారు. మరి నేను ముందే చెప్పాను కదా ఇది కథ అని. కాబట్టి అవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్. మీలో కొంత మంది తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు అడవి మొత్తం ఏనుగు చీమే ఉండేవా! మిగతా జంతువులేమయిపోయాయి అని అనుకోవచ్చు. ఆ మిగతా జంతువులు అడవిలోనే ఉన్నాయి కాని ఈ కథ లో లేవు). చీమ, ఏనుగు కలిసి ఒక weekend స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాయి. స్విమ్మింగ్ చేస్తుంటే ఏనుగు కాళ్ళకి ఎదో తగిలితే చెయ్ పెట్టి తడిమింది.(తెలివయిన వాళ్ళు, ఏనుగు కి చేయి ఉంటుందా అని అడగొద్దు. ఇది కథ) దాన్ని పైకి తీసి చూసే సరికి ఏనుగు కి గుండె ఆగినంత పనయ్యింది. దాని చేతిలో ఒక గన్ ఉంది. చీమ ఆ గన్ ని చేతిలోకి తీస్కొని చేతి చూపుడు వేలుతో గిర గిర తిప్పింది.
ఏనుగు ఆశ్చర్యపోయి “చీమ భయ్యా, ఏంటి గన్ ని అల తిప్పావ్ బాగా తెలిసినట్లు. అలవాటుందా?” అని అడిగింది.
దానికి చీమ “సినిమాలు చుడట్లేదేంటి” అంది.
“Bro, నువ్వు సినిమాలు కూడా చూస్తావా అయతే నన్ను కూడా తీస్కేల్లవా!” అని ఏనుగు అడిగింది. దానికి సరే ఐస్ క్రీం సినిమా రిలీజ్ అయ్యిందంట. వెళ్లి ఆ సినిమా చూద్దాం ఈ రోజు సెకండ్ షో కి అంది. రాత్రి కి ఆ రెండు గళ్ళ నిక్కరు వేసుకొని పుల్ల ఐస్ చీక్కుంటూ ఐస్ క్రీం సినిమా కి వెళ్ళాయి. కాని unforunately ఆ సినిమా అయిపోయేసరికి ఆ థియేటర్ లోనే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రాణాలు విడిచారు.
దీన్ని బట్టి మీకు అర్థం అయిన నీతేంటి? చించండి.. బాగా ఆలోచించండి. ఏమి అర్థం కాలేదా? మీలాంటి వాడే ఎవడో రామాయణం అంతా విని కృష్ణుడికి రాధ ఏం అవుతుంది అన్నాడంట వెనకటికి. ఇంకా moral ఏంటి అని ఆలోచిస్తున్నారా! హుహుహహహః నేనెంత ఎదవనో నాకే తెలీదు.

25, డిసెంబర్ 2012, మంగళవారం

అమ్మ కావాలి.

బాబు నోట్లో వేలేసుకొని చాలాసేపటినుంచి తల్లిని గమనిస్తూ ఉన్నాడు. ఎర్రతేలుల ఉన్న తమ్ముడిని పదే పదే ముద్దు పెట్టుకుంటుంది అమ్మ. వాడికి లాల పోసి మళ్లీ ముద్దు పెట్టుకుంది. గంటసేపు కాలి మీద పడుకోబెట్టుకొని పౌడరు రాసి కాటుక పెట్టి నల్లటి బొట్టు ముఖం మీద బుగ్గ మీద పెట్టి మళ్ళీ మళ్ళీ తమ్ముడిని ముద్దాడింది.

బాబుకి చాలా కోపంగా ఉంది. తను వెళ్లి తమ్ముడి వేలు ముట్టుకుంటే వాడు ఎందుకో గుక్క పట్టి ఏడ్చాడు. వెంటనే గుభీ గుభీమని తన వీపు మీద రెండు గుద్దులేసి తమ్ముడిని గుండెలకు హత్తుకుని పాలిస్తూ 'ఫో వెదవా మీ నాన్న దగ్గరికి!' అని కసిరింది అమ్మ. బాబు గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. తమ్ముడి మీద చెప్పలేనంత అక్కసు కలిగింది వీదూ వచ్చాక అమ్మకి తన మీద ప్రేమ పోయింది. అంతకు ముందు ఎప్పుడూ తననే ముద్దుపెట్టుకునేది. 'టీచర్ గారు ఏం  చెప్పార్రా బాబీ' అంటూ తను ఎన్ని రైమ్స్ చెప్తే అన్ని ముద్దులిచ్చేది. పొద్దుటే లేచిలేవంగానే అమ్మానాన్నారూ చేరోముద్దు ఇచ్చేవారు.ఎంతో గారంగా తను చేసే అల్లర్నంత భరించి తనచేత పాలు తాగించి లాలపోసి తల దువ్వి నిక్కరు చొక్కా వేసి పౌడరు రాసి ముద్దు పెట్టి స్కూలుకి పంపేది అమ్మ. నాన్నారి స్కూటర్ ఎక్కి టాటా చెప్తుంటే  అందంగా నవ్వేది అమ్మ. మళ్ళీ సాయంత్రం బళ్ళోంచి రాగానే అప్పచ్చులు పెట్టేది. ఆడుకొని రాగానే మళ్ళీ లాలపోసి ముస్తాబు చేసి ముద్దు పెట్టుకొనేది.

కాని అమ్మ పొట్టలోకి ఈ ఎర్రతేలు వేదవ దూరంగానే అమ్మ మారిపోయింది. చిన్నపొట్ట ఉన్నప్పుడు లోపల తమ్ముడు అల్లరిచేసేవాడు కాదట. పొట్ట పెద్దదవంగానే తమ్ముడు అల్లరి మొదలెట్టాడని నాన్నారు చెప్పారు. 'అల్లరి చేయకుండా వాడిని కొట్టు' అన్నాడు నాన్నగారితో. నానారు అదిరిపడి 'తప్పమ్మా బాబీ! అమ్మకి దెబ్బ తగలదూ ?' అన్నారు.

పోనీ అని అప్పుడూరుకున్నాడు తను. ఎప్పుడూ అమ్మ పక్కలో లేనిదే నిద్రపట్టదు తనకి. పీడకలలు - దెయ్యం కలలు - టీచరు చెప్పే మాంత్రికుడి కలలు - రోజు పడ్కున్నాక వస్తే భయమేసేది తనకి. అమ్మ మారిపోయింది. తమ్ముడు వెధవకి పొట్టలో దెబ్బ తగులుతుందని తనను పడ్కోబెట్టుకోదట. నాన్నారి దగ్గరేమో సిగరెట్టూ కంపు. పైగా కాలు మీద వేస్తే 'వెదవా సరిగా పడుకో' అని దూరంగా తోసేస్తారు తనకి మళ్ళీ కల వచ్చి భయం. అమ్మ చిచిపోయించి నిద్రపుచ్చేది. నాన్నారు మర్చిపోయారు. పక్కమీదే నిద్రలో చిచ్చిపోసేస్తే నాన్నారు రెండు పుచ్చుకున్నారు పరుపు పాడయిన్దంటూ. 'మరి నిద్రపోయేముందు నువ్వెందుకు చిచ్చిపోయించలేదు?' - కోపంగా చూసాడు తను. కానీ నాన్నారికి అర్థం అయితేనా?

మడత మంచం మీద కూలేసి 'పడుకో' అని కేకలేశారు. భయమేసి అమ్మ పక్కలోకేల్లి పడుకుంటే మళ్ళీ ఎప్పుడెల్లిపోయిందో మడత మంచం మీద పడుకుంది. ఎంత కోపం వచ్చిందని! ఈ తమ్మ్ముడు గాడు అసలు బాలేదు - నల్లగా ఉన్నాడు వాడిని బాగా ఉతకమని అమ్మకి చెప్పాలి. వాడు నవ్వితే చాలా బాగుంటాడు. ముద్దుపెట్టుకున్దామని వంగితే 'ఎంగిలి అవతలికి పో ' అంటుంది అమ్మ. ఇంకెలా?

అమ్మా నాన్నారు వాడిని ముద్దుపెట్టుకుంటే ఎంగిలవదేం? అమ్మ దగ్గర బబ్బుని ఎన్నాళ్ళయిందో? అమ్మమ్మ దగ్గర బబ్బోమని అంటుంది అమ్మ. అబ్బా ముసలి కంపు.

తమ్ముడికి రోజూ కొత్త చొక్కాలు వేస్తుంది అమ్మ. 'నాకో' అంటే 'స్కూలు డ్రెస్సు మొన్ననేగా కుట్టించాను! అది వెసుకో' అంది. అసహ్యంగా స్కూలు డ్రేస్సేమి బాగుంటుంది?

'అమ్మా ఇవాళ నీ దగ్గర బబ్బున్టానే '
'వద్దమ్మా తమ్ముడికి నొప్పెడుతుంది'
'ఎప్పుడూ తమ్ముడేనేంటి? నాకు భయం' మొండికేసాడు బాబు.
'నన్ను విసిగించకు. మద్యాహ్నం అంతా చంటి వెధవతో నిద్రలేదు రాత్రి నువ్వు తయారవుతావా? అమ్మమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి గాని పోయి పడుకో'
'ఎం వద్దు. తమ్ముడినే పడుకోబెట్టుకో. రోజూ వీడే ఎందుకు పడుకుంటాడు నీ దగ్గర?'
'వెధవ ప్రశ్నలేయకు వెళ్ళు మంచం ఎక్కకు మట్టి కాళ్ళతో' అని బాబుని విసుక్కుంది.
'తమ్ముడి వెధవని చంపేస్తాను' బాబు గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. వాడి కళ్ళు, ముక్కు కోపంతో అదురుతున్నాయి. హడలిపోయింది వేద.
'ఛీ వెధవ పెచీలోద్దన్నానా? నీకు ఆకలేస్తున్దిగాని వెళ్ళు అమ్మమ్మను అన్నం పెడుతుంది. తిని నాన్నారి దగ్గరకి పో'
'నువ్వే పెట్టు'.
ప్రాణం విసుగెత్తి రెండు అంటించింది అమ్మ. బాబు ఏడుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మంచం పక్కనే కింద దొర్లి దొర్లి నిద్రపోయాడు. చిన్న బాబుకి స్నానం చేయించి పౌడరు రాసి కాటుక పెట్టి చొక్కా తొడిగి ముద్దు పెట్టుకుంది వేద. బాబు తదేకంగా చూస్తున్నాడు వాడిని కూడా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చిన్నవాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది.

పావుగంట కాకముందే పసివాడి ఏడుపు వినిపించేసరికి గుండెలదురుతుంటే పరుగెత్తుకొని వచ్చింది. ఉయ్యాల దగ్గరికి ఎప్పుడు ఈడ్చుకొచ్చాడో చిన్న స్టూలు తెచ్చి దాని మీద నుంచుని ఉన్నాడు బాబు. వాడి చేతిలో పెద్ద రాయి ఉయ్యాలలో పసివాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పిశాచాన్ని చూసినట్లనిపించి కెవ్వుమంది వేద.
అంతా చీకటి. లైటు వేసి పరిగెత్తుకొచ్చాడు రాజ రావు.
'వేదా  ! మళ్ళి  పీడకల వచ్చిందా?'
'బాబు చిన్నవాడిని బతకనివ్వడండి' రెండు చేతుల్లో తల పెట్టుకొని బావురుమని ఏడ్చింది వేద.
'ఛీ ఊరుకో పిల్లలు లేస్తారు. ఏమయింది నీకు. ఇందాక కూడా ఇలాంటి కలే వచ్చిందా? బాబు తమ్ముడిని చంపడమేమిటి' అయోమయంగా ఉంది అతనికి.
దాదాపుగా గంట తర్వాత ఆమె తల ప్రేమగా స్పృశించాడు రాజారావు.
'పిచ్చిదానా తల్లివయుండి పసివాడు మనసునిదేనా నువ్వు అర్థం చేసుకున్నది? ఈ కలలన్నీ నీ ఊహలే. బాబుకి తమ్ముడంటే ఎంతో ప్రేమ. నిద్రపోయేటప్పుడు వాడిని కూడా రేపట్నుంచే స్కూలుకి తీస్కేల్తానని మారం చేసాడు'.
'మరి....'
'మనం చాల పొరపాటు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది వేద!' సాలోచనగా అన్నాడతను.
'అంటే?'
'బాబుది తెలిసీ తెలియని వయసు. ఈ అయిదేళ్ళు వాడిని ఒక్కడే కొడుకని విపరీతమయిన గారం చేసాము. వాడు అడిగినదల్లా కొనిచ్చి ముద్దు ఛేసాం రెండవ వాడు పుట్టగానే వాడి మీద శ్రద్ధ ఇటు మళ్ళింది మనకి అక్కడే పొరపాటు చేసాం'
'వాడికేం లోటు చేసాం? ఎప్పటిలాగే చూస్తున్నాం కదండీ!'
' ఎం చూస్తున్నావు టైం అంతా చిన్నవాడి సంరక్షనకే సరిపోతుంది. అది పసిమనసుకేం అర్థమవ్తుంది?'
'వాడికి కావలసిందల్లా అమ్మ. అమ్మే అన్నం పెట్టాలి. నిద్ర పుచ్చాలి. అమ్మ దగ్గరే పడుకోవాలి. అమ్మే స్నానం చేయించాలి. తమ్ముడు వాటాకొచ్చేసరికి వాడి లేత మనసు తెలీకుండానే గాయపడింది. ఇది వరకు నిద్రపోతే అసలు లేచేవాడు కాదు ఇప్పుడు చూడు గడియ గడియ కి లేచి విసిగిస్తున్నాడు. వాడికి నువ్వు కావలి. వాడి అసహనం ఎందుకో వాడికే తెలియకపోయినా చిరాకు భరించలేక నోరు విడిచి నీ దగ్గర పడుకుంటాను అని అడిగాడు. వద్దనే సరికి కోపం వచ్చి తమ్ముడే కారణం అని కోపంలో అలా అన్నాడు'
'మరి ఎలాగండీ వీడి సంగతి?'
'మనలాగే చాలా మంది తల్లి దండ్రులు రెండో బిడ్డ రాగానే మొదటివాడిని నిర్లక్ష్యం చేస్తారు. ఉదయం పేపర్లో చదివిన సంగటన నీ మనసులో ముద్ర పడిపోయింది కదూ! పెద్దవాల్లయ్యాక అన్నదమ్ముల మద్య అనుబంధం లోపించింది అని బాధ పడతాం తప్ప మనమే కారణమని తేలియదు మనకి. రెండో బిడ్డ రాబోయే ముందే పెద్దవాడిని వాడి రాక కోసం సిద్దం చేయాలి లేదా వాడి లేత మనసుకు అర్థం అయ్యేటట్లు తమ్ముడు అంటే ఆడుకోడానికి వచ్చే స్నేహితుడని వాడిని ప్రేమగా చూడాలనీ చెప్పాలి. వాడి వంటి మీద చెయ్యే వెయ్యనివ్వవు నువ్వు. బాబుకేమో సహజమయిన కుతూహలంతో చిన్నవాడిని ముట్టుకోవాలని ఉంటుంది.'
'పసివాడికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని భయపడ్డాను గాని, బాబు లేత హృదయానికి తగిలిన దెబ్బను గుర్తించలేకపోయాను అండీ ! ఒక తల్లి కడుపునా పుట్టకపోయినా రామ లక్ష్మణులెలా కలిసిపోయారు? ఇంక నిద్రపోండి. అర్థ రాత్రి దాటింది'
'మళ్ళీ పీడకలోస్తే?'
'ఇంకా రావు నా మనసులో ఆందోళన తగ్గిపోయిన్డిగా.'

*****

మర్నాడు స్వయంగా అమ్మే తనకి స్నానం చేయించి ముద్దులు పెట్టుకుంటుంటే బాబు లేత మనసు పొంగిపోయింది. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ' అమ్మా! తమ్ముడిని స్కూలుకి తీసుకేల్లనా?'
ముద్దుగా అడిగాడు బాబీ.
'వద్దు బాబీ! తమ్ముడు ఇంకా చిన్నవాడు కదా! నీ అంత అయ్యాక తీసుకేల్దువు గాని. ఇంటికి వచ్చాక తమ్ముడితో ఆడుకున్డువు గాని' అని మళ్ళీ ఘాడంగా ముద్దు పెట్టుకుంది బాబుని.
వాడి కళ్ళు ఆనందంతో తలుక్కుమన్నాయి.....

******

( ఈ కథ నా సొంతం కాదు. మొన్నీ మద్య కోఠి లో ఒక చిన్న పాత పుస్తకం ఒకటి కొన్నాను. అందులో 1986 లో రాసిన మనసుకు హత్తుకునే ఈ కథ చదివగానే కళ్ళు చెమర్చి మనసు తేలికపడినట్లుగా అనిపించి అందరికి ఈ కథ చేరాలి అనే సదుద్దేశంతో ఈ బ్లాగులో రాసాను.)

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

నేను - పానీ పూరి - 225 C/A

రాజేంద్ర నగర్ లో మొదటి బస్సు కోసం ఉదయం ఏడు గంటలకు బస్సు స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. బస్సు ఎక్కుతుండగా కండక్టర్ డ్రైవర్ స్మైల్ ఇచ్చి హాయ్ చెప్పారు. నేను కూడా హాయ్ చెప్పి కూర్చున్నాను. నేను తప్ప ఎవరు ఎక్కలేదు బస్సు లో. ఎందుకంటే రాజేంద్ర నగర్ లోని NG Ranga PG college లో స్టూడెంట్స్ అంత త్వరగా లెగడం అంత పొద్దున్నే ఫస్ట్ బస్సు క్యాచ్ చేయడం చిత్రమే అవ్తుంది. అందుకేనేమో మొదటి రోజు నేను ఆ బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ చిత్ర విచిత్రంగా చూసి ఎక్కడ్నుంచి వస్తున్నావ్ ఎక్కడ్కేల్తున్నావ్ లాంటి ప్రశ్నలతో పాటు పుట్టు పూర్వోత్తరాలు తెలుస్కోని గానీ టికెట్ ఇవ్వలేదు. అలా రెండు రోజులు నిద్ర లేచాక వాళ్ళు చూసిన మొదటి మొహం నాదే అవ్వడం తో మూడో రోజునే నాకు స్మైల్ హాయ్ చెప్పేసెంత పరిచయం కల్గింది. అంత పొద్దున్నే ఆ బస్సు మరి నువ్వెందుకు ఎక్కుతున్నవని మీరు కూడా అన్కోవచ్చు. చెప్తా..అది కూడా చెప్తా...కాస్త ఆగండి...

చక్రాలు...జంతికలు....సుడి గుండాలు...

ఏదోటి సాదించాలి అని IIT లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ అయ్యా గానీ. సాదించాల్సిన సీట్ IIT లోనో IIIT లోనో ఎంసెట్ లోనో డిసైడ్ అవడం లోనే ఆ సంవత్సరం అంత గడిచిపోయింది. రెండు బెంజీన్ లను వాటర్ లో కలిపి సాల్ట్ తగిలిస్తే ఏం అవుతుంది అన్న ప్రశ్నకు నా పాక శాస్త్ర ప్రావిణ్యం తోడు చేసి కాంటినెంటల్ సూప్ అవ్తుంది అని రాయడం తో IIT exam దొబ్బేసింది. వచ్చిన invigilator అతిక తెలివి వల్ల AIEEE exam కూడా తన్నేసింది. (OMR షీట్ లో పెన్ను తోనే నింపాలని ఒక రూల్ ఏడ్చింది. ఒక సెకండ్ లో ఆన్సర్ చేయడం బాగా అలవాటయిన చేయి కదా ఒక సెకండ్ లోనే పేరు రాసేద్దామని పెద్ద పెద్ద అక్షరాలతో రాసేసా. రాసాక అర్థం అయింది రాయాల్సిన చోట రాయకుండా ఇంకో చోట రాసా అని. invigilator కి చెప్తే నేను చూస్కుంటా అని చెప్పి నా పెన్ను OMR sheet అన్ని తీస్కోని ఎటో ఎల్లిపోయాడు. అర గంట తర్వాత వచ్చి నా OMR sheet తెచ్చి ఇచ్చాడు. ఉలితో ఒక శిల్పాన్ని చెక్కినట్లు, కత్తితో పెన్సిల్ ని చెక్కినట్లు నా OMR sheet ని blade తో చెక్కేసాడు. గుండె ఆగినంత పని అయింది. ఏం చేయాలో తెల్సుకునే లోపు పుణ్య కాలం కాస్త అయిపోయి రాహు కాలం కూడా వచ్చేసింది). ఒక సంవత్సరం వేస్ట్ అవకుండా ఉన్న ఒక్క అవకాశం ఎంసెట్. అది కూడా నన్ను తన్నకుండా జాగ్రత్త పడి నేను దాని తోక ని తొక్కడం తో మంచి ర్యాంకు JNTU లో సీటు రెండు వచ్చేసాయి. జాయిన్ అయ్యే ముందు యూనివర్సిటీ లో జాయిన్ అవ్తున్నావ్ రాగ్గింగ్ ఉంటుంది అని చాలా మంది హెచ్చరించారు నా పరిస్తితి ని గురించి చాలా మంది చర్చించారు కూడా. కాని మొదటి రెండు రోజులు కాలేజీ కి బయం బయం వెళ్లాను గానీ అసలు ఒక సీనియర్ కూడా ఎదురుపడలేదు. రాగ్గింగ్ ని కూకటి వేళ్ళతో సహా పీకేసం అని ప్రిన్సిపాల్ మొత్తుకుంటుంటే నమ్మకపోతే ఫీల్ అవతాడని నమ్మేస కూడా. అలా మూడో రోజు రాగ్గింగ్ ఎలానో లేదు కదా అని జీన్స్ రంగు రగుల షర్టు ఒకటి ఏసి కోఠి బస్సు స్టాప్ రావడం తో కళ్ళు తుడుచుకుంటూ బస్సు దిగేసాను. ( బస్సు దిగుతున్నందుకు వచ్చిన కన్నీళ్లు కాదు అవి రాగ్గింగ్ లేని అంత మంచి కాలేజీ లో సీటు దొరికినందుకు కలిగిన ఆనంద భాష్పాలు) . ఇంతకీ అంత త్వరగా కాలేజీ కి ఎందుకు అంటే రెండు కారణాలు ఉన్నాయ్. రాజేంద్ర నగర్ నుంచి కోఠి కి ఎల్లాలంటే గంట. అక్కడి నుంచి JNTU ki గంట. గంట ముందు కాలేజీ కి వెళ్తే రాగ్గింగ్ బారిన పడకుండా లోపలకేల్లిపోవచ్చని ఎవడో చచ్చు వెదవ ఇచ్చిన అయిడియ. గంట ముందు వెళ్తే ఆ టైం రాగ్గింగ్ చేయించుకోడం కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు కదా అన్న ఆలోచన ఆడికి రాలేదు నాకు రాలేదు. 7 - 8 రాజేంద్రనగర్ తో కోఠి, 8 - 9 కోఠి - JNTU , 9 - 10 డోర్ లు ఎస్కుని classroom లో కూర్చోడం. ఇది నా ప్లాను. కాని నేను హైదరాబాదు లో అడుగు పెట్టడం అదే మొదటి సారి అవడం తో అంత కొత్తగా భయంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్న బస్సులలోనే ప్రయాణించాలి. బస్సు మీద నెంబర్ సరిగా కనపదేలోపులే బస్సు వేల్లిపోఎవి. ఎక్కడికేల్లలో తెలిసిన కూడా ఏ నెంబర్ బస్సు ఎక్కలో తెలిసి చచ్చేది కాదు. హైదరాబాద్ లో అడుగు పెట్టగానే మా అన్నయ్య ఒకటే మాట చెప్పాడు. 95P, 225A ఈ రెండు నెంబర్లు గుర్తు పెట్టుకోమన్నాడు. చిన్నప్పుడంతా తెలుగు మీడియం లో చదవడం మూలాన A,B,C,D లను నేను మొదటి నుంచి పట్టించుకునే వాడిని కాదు. కోటి - రాజేంద్రనగర్ మద్యలో 95 బస్సు ఎక్కాలి. కోటి - JNTU మద్యలో 225 బస్సు ఎక్కాలి. ఈ రెండు నెంబర్లను గుర్తుపెట్టుకొని మొదటి రెండు రోజులు తిరిగేసాను.

మొత్తానికి మూడో రోజు 225 బస్సు దిగి JNTU లోకి అడుగు పెట్టా. రెండు రోజులు రాగ్గింగ్ లేకపోవడం తో నాకు తెలీకుండానే కాలర్ వెనక్కేల్లింది. పైన పాకెట్ లో పెన్. చేతిలో ఒకటే ఒక్క notebook. కింద jeans, పైన రంగుల చొక్కా. జూనియర్ ని అని ఎవరు ఈజీగా గుర్తుపట్టకోడదు అని ఇన్షర్టు కూడా చేసేసా....త్వరగా వచ్చేయడం వల్ల ఏం చేయాలో తెలీక ఆలోచిస్తున్న సందర్భం లో కాంటీన్ కనపడింది. ఆకలేస్తుంది. కాంటీన్ కి జునిఒర్స్ వేల్లకోడదు అని చెప్పారు.. బ్యాక్ గ్రౌండ్ లో మన్మధుడు సినిమా లోని "వద్దురా వద్దురా వేల్లెల్లి గోతిలో పడోద్దురా " అన్న పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించింది. అయినా నన్నెవరు గుర్తుపడతారులే అన్న దైర్యం ముందుకి నడిపిస్తుంది. లోపలకెల్లి బోండాలు తీసుకొని తింటున్నా.."వద్దురా వద్దురా" మళ్ళి వినిపించింది. అస్సలు గుర్తు పట్టకోడదు అని చెస్ట్ ముందుకు పెట్టి మరీ తింటున్నా. బాలయ్య ని బీట్ చేసే నా ఓవర్ యాక్షన్ చూసి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు నా దగ్గరకి వచ్చారు. సీన్ కట్ చేస్తే నేను మాస్ సినిమాలో వాలు కల్ల వయ్యారి పాట పాడుతున్నాను. మళ్ళి సీన్ కట్ చేస్తే ఇంద్ర పాటకి డాన్సు..టన్ ట టన్ ట టన్టన్..టన్టన్ టన్ ట టన్ ట టన్టన్...దాయి దాయి దామ్మా పాటకి డాన్సు చేస్త్నాను. సీన్ కట్ చేస్తే inshirt తీసేసి ప్యాంటు పైకి మడత పెట్టి. హోయ్లేస్సా హోయ్లేస్సా కి సోలో పెర్ఫార్మన్స్ ఇస్తున్నా. ఆ పాట తెలీదా. అదే అండీ కమల్ హాసన్ చేపలు పట్టేవాడిలా సోలో డాన్సు చేస్తాడు. ఆ శుభ సంకల్పం. ఆ నంది అవార్డు పెర్ఫార్మన్స్ చూసిన ఆ ముగ్గురు సీనియర్లు జీ తెలుగు లోని ఓంకర్ల చాలా బా చేసావు చాలా భా చేసావు అని పొగిడి పైన జేబులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. ఆ ఆనందం లో నా కల్ల వెంట వచ్చిన ఆనంద భాష్పాలను తుడుచుకొని ఇంటికేల్లడానికి 15rupees అవుతాయి, డబ్బుల్లేవ్ వెళ్లి రావడానికి ఓ 30 రూపాయలు ఇమ్మని ప్రాదేయపడ్డా. నా హృదయంతరాలలో నుంచి లావాల ఉబుకుతున్న ఆనంద భాష్పాలను చూసి హృదయం ద్రవించి ఓ 30 రూపాయలు చేతిలో పెట్టి నన్ను వదిలేసారు. జజ్జనక జనారే జజ్జనక జనారే అని బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంది. అదేంటి డబ్బులు దొబ్బెస్తే sad మ్యూజిక్ రావాలి గానీ ఇదేంటి ఈ పాట.మతిలేని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా. అక్కడే మీరు ఉప్పులో కాలేసారు. మీరు కూడా ఆ వెర్రి సీనియర్ లలా (సీనియర్ లు ఎప్పుడు జూనియర్ లకు లోకువే అని నా ఉద్దేశ్యం)నా intellegence ని క్యాచ్ చేయలేదు. వెళ్ళడానికి పదిహేను రూపాయలు. మరి ఇంకో పదిహేను ఎందుకు. ఎందుకు ఎందుకు.


మళ్లీ చక్రాలు...జంతికలు...చేగోడీలు..


ఇంటర్ హాస్టల్ పెట్టిన్డల్లా తిని జిహ్వ చాపల్యం చచ్చి గుర్రుగా నిద్రపోతున్న నాలోని కుంభ కర్ణుణ్ణి తట్టి లేపింది పానీ పూరి. ఇంకా అపట్లో పానీ పూరి ఊర్లల్లోకి రాలేదు. మొదటి సారి హైదరాబాద్ లో అడుగు పెట్టిన రోజున మొదటి సారిగా తిన్నాను. ఆహా. గుండ్రని పూరి. అందులో వేడి వేడి ఆలు కూర. పుల్ల పుల్లని కారం కారం గా ఉండే నీటిలో ముంచి నోట్లో పెట్టుకుంటే ఉంటది నా సామి రంగా. ఆ రుచి కి మొదటి సారి డంగ్ అయిపోయాను. ఆ రోజు నుంచి రోజూ పానీ ఊరి తినకుండా ఉండలేక పోయేవాడిని. అలా పానీ పూరి కి బానిసయిన నేను, తెచ్చిన డబ్బులన్నీ ఆ పానీ తాగుడు కి తగలేసేవాడిని.

ఆ రోజూ కాలేజీ అయ్పోయాక ఉన్న ముప్పయి రూపాయలలో పదిహేను రూపాయలు కి సరిపడా పానీ పూరి తినేసి బస్సు స్టాండ్ లో 225 బస్సు కోసం వెయిట్ చేస్తున్న. అంతలో 225 C/A బస్సు వచ్చింది. ఎక్కేసి కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు కండక్టర్. తిన్నగా కోఠి అని చెప్పొచ్చు కదా నేను. అలా చెప్తే ఈ స్టొరీ రాయడం ఎందుకు. లాస్ట్ స్టాప్ అని స్టైల్ గా చెప్పా. టికెట్ చేతిలో పెట్టాడు. బాగా పానీ పూరి లాగించడంతో నిద్ర ముంచుకొచ్చింది. పడుకొని లేచేసరికి కండక్టర్ లాస్ట్ స్టాప్ అని అరుస్తున్నాడు. గబా గబా దిగిపోయా. కాని అది కోఠి కాదు. దూరంగా చార్మినార్ కనపడ్తుంది. అప్పుడు అర్థం అయింది నేను దిగింది చార్మినార్ దగ్గర అని. ఇన్నాళ్ళు ఇన్నిన్ని బుక్స్ చదివాను గానీ A,B,C,D ల వేల్యూ అర్థం అవ్వలేదు. 225A అంటే కోఠి కి, 225 C/A అంటే చార్మినార్ కి వెళ్తుంది అని అర్థం అయింది. మొదటి సారి చార్మినార్ అలాంటి పరిస్తితుల్లో, అనుకోకుండా చేతిలో డబ్బులు కూడా లేకుండా చూస్తానని. తప్పు బస్సు ఎక్కితే ఎక్కాను గానీ చార్మినార్ ని చూసనన్న ఆనందం మాత్రం అలాగే ఉండిపోయింది. చార్మినార్ బస్సు స్టాప్ కి వెళ్లి కోఠి ఎల్లాలంటే ఎలా అని ఒకడిని అడిగాను. ఈ బస్సు ఎక్కేయ్ అని ఒక బస్సు చూపించాడు. పరిగెత్తుకుంటూ ఎల్లి ఎక్కేసా. హమ్మయ్య ఎలాగయినా కోఠి కి ఎల్లిపోతున్నా పెద్ద ప్రాబ్లం లేకుండా అనుకుంటున్న టైం లో కండక్టర్ వచ్చి "టికెట్" అన్నాడు. నేను "కోఠి" అన్నాను. "పెద్ద పెద్ద చదువులు చదువుతారు గానీ ఏ బస్సు ఎక్కలో కూడా తెలీదు. ఇది కోఠి ఎల్లదు secundrabaadu ఎల్లుతుంది" అని నన్ను తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి కాచిగూడ లో దింపేసి ఎల్పోయాడు.ఉన్నవి 7 రూపాయలు, కాని వాటితోనే కాచిగూడ to కోఠి..కోఠి to రాజేంద్ర నగర్ ఎల్లాలి. ఎలా ఎల్లాలో తెలీదు, ఎల్లదానికి డబ్బుల్లేవు. ఏం చేయాలో తెలీక టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలో తెలీక రోడ్ పక్కన కుర్చుండిపోయా. జీవితంలో పానీ పూరి తినకోడదని శపథం చేస్తున్న సమయానికి దూరంగా వేగంగా వెళ్తున్న ఒక బస్సు మీద కోఠి అని కనపడింది. కోఠి నుంచి రాజేంద్ర నగర్ ఎల్లదానికి డబ్బులు లేకపోయినా కూడా కోఠి ఎల్లడం ముఖ్యం తర్వాత మనీ కోసం ఏదోటి చేద్దామని ఆ బస్సు వెనకాల పరిగెట్టడం మొదలెట్టా. దీనబ్బ జీవితం ఇంతలా ఎప్పుడు పరిగేట్టలేదు. మగధీర సినిమాలో గుర్రం వెనక రాం చరణ్ పరిగేట్టినట్లు, పోలీసు లు లాఠి ఛార్జ్ చేస్తుంటే జనాలు పరిగేట్టినట్లు పిచ్చ పిచ్చగా పరిగెత్తా. చివరకి పరిగెత్తి పరిగెత్తి బస్సు ఎక్కేసా. ఎక్కి ఎక్కగానే బస్సు ఆపేసాడు. కండక్టర్ కోపంగా వచ్చి " అంత పరిగెత్తుకుంటూ ఎక్కకపోతే నెక్స్ట్ బస్సు ఎక్కవచ్చు కదా!! ఇంతకీ ఎక్క్కడికి వెళ్ళాలి" అన్నాడు. "కోఠి" అన్నాను. "చదువుకుంటే ఉన్న మతి పోయిందంట...నువ్ బస్సు ఎక్కడానికి కోఠి వరకు బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేశావు..దిగు దిగు ఇదే కోఠి" అన్నాడు. రూపాయి ఖర్చు లేకుండా చార్మినార్ తిరిగొచ్చిన నా adventure ను గుర్తు చేసుకుంటూ రాజేంద్ర నగర్ ఎళ్ళ డానికి 95 బస్సు ఎక్కా. విండో సీట్ లో కుర్చుని కిటికీ లోంచి బయటకి చూస్తున్నా. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మని "అమ్మ పానీ పూరి కావాలి" అని ఏడుస్తున్నారు. అది చూసి గుండె ఆగినంత పని అయింది. వెంటనే బస్సు దిగి మళ్ళి బోర్డు చూసా. అది 95 కాదు, 95P , నేను ఎక్కాల్సిన బస్సు అదే అని రెండు సార్లు చూసి confirm చేసుకున్న తర్వాత మళ్ళి బస్సు ఎక్కా .

16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఓ వెన్నెల రాత్రి

నేను చిన్నప్పుడు భయం ఉందొ లేదో తెల్సుకోడానికి దెయ్యాల సినిమాలు ఒంటరిగా చూడటానికి ప్రయత్నించే వాడిని. అలా చూసి చూసి మొత్తానికి మునిగింది ఏమిటంటే నాకు భయం ఉందని. భయం ఉన్నా కూడా నిజంగా దెయ్యాలు ఉంటాయ ఉండవా అన్న ఆత్రుత మాత్రం అలాగే ఉండిపోయింది. మా మామ్మ వాళ్ళ ఊరు చిన్న పల్లెటూరు కావడం వలన వేసవి లో అక్కడ ఉన్నప్పుడు అందరితో పాటు ఆరు బయట పడుకోవాల్సి వచ్చేది. అలా పడ్కున్నప్పుడు రాత్రిళ్ళు దూరంగా ఏవో కదులుతున్నట్లు వింత ఆకారాలు కనిపించేవి. ఒకరికి కనపడినపుడు ఇంకొకరికి కనపడేవి కావు అందుకే అవి నిజమో కావో అని ఎవరు తేల్చి చెప్పలేకుందే వారు. దెయ్యాలు నిజంగానే ఉనయన్న నిజాన్ని తెల్సుకోడానికి కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన తోడ్పడింది. ఆ సంఘటన ఇలా....(దెయ్యాలు లేవనుకున్న వాళ్ళు, ఓ వెన్నల రాత్రి అనగానే ఇదేదో రొమాంటిక్ టైపు అని ఎగేస్కోని వచ్చిన వాళ్ళు ఇది చదవకపోవటమే మంచిదని నా ఉద్దేశం తర్వాత మీ ఇష్టం..)

కొన్నేళ్ళ క్రితం మా మామ్మ వాళ్ళ ఊరులో ఉన్నప్పుడు ఒక రోజు కరెంటు కోట ఉండటం తో బోర్ కొట్టి దగ్గర ఉన్న సినిమా హాలులో ఏదో ఒక సినిమా కి వెళ్దామని అనుకున్నాను. దగ్గర అంటే మరీ అంత దగ్గరేమి కాదు. మా ఊరు నున్చిఎనిమిది కిలో మీటర్ల దూరం లో మరొక ఊరు ఉంది అక్కడకు వెళ్తే గానీ సినిమా హాలులో సినిమా చూడలేం. అందులో రెండు కిలో మీటర్ల వరకు పొలాల మద్య చెట్ల మద్య నడిచి వెళ్లి అక్కడ నుంచి రిక్షా పట్టుకుంటే సినిమా హాలుకి చేరుకోవచ్చు. త్వరగా కరెంటు వచ్చే అవకాశం లేకపోవడం, అన్నయ్య పని మీద అదే ఊరు బైక్ మీద వెళ్తుండటం తో సెకండ్ షో అయినా సినిమా కి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. అన్నయ్య కి అక్కడ రెండు మూడు గంటలు పని ఉండటం తో వచ్చేటప్పుడు అన్నయ్యతో వచ్చేయోచ్చని అంతరాత్మ లెక్కించి చెప్పింది. అన్నయ్య నన్ను హాలు దగ్గర తొమ్మిది గంటలకల్లా దింపేసి వెళ్ళిపోయాడు. టికెట్ కౌంటర్ దగ్గర అసలు జనాలు లేరు. టికెట్ తీస్కోని లోపలి వెళ్లాను. హాలు మొత్తం లో అక్కడక్కడ ఇద్దరో ముగ్గురో ఉన్నారంటే. కేవలం నా సీట్ దగ్గర మాత్రమే ఫ్యాన్ తిరుగుతుంది చాల నెమ్మదిగా. దాని పైననే లైట్ ఉండటం తో నీడ కూడా పెద్ద ఫ్యాన్ లాగ హాలు అంత తిరుగుతుంది. లైట్ ఆపకుండానే సినిమా స్టార్ట్ చేసేసాడు.

"ఇతని పేరు వంశీ. ఇక్కడకు వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్" అని బాక్గ్రౌండ్ లో స్టొరీ చెప్పడం మొదలెట్టాడు, ఖాకి కలర్ డ్రెస్ ఎస్కున్న ఒక నది వయస్కుడి ఫోటో ఒకటి స్క్రీన్ మీద చూపిస్తూ. "ఈ అమ్మాయి ఇదే ఊరి బయట ఉండే పడు బడ్డ బంగలో ఈ మద్య నుంచే ఉంటుంది." అని స్క్రీన్ మీద ఒక అందమయిన అమ్మాయి బొమ్మ చూపించాడు. " ఈమెను చూడగానే తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇద్దరికీ తల్లి దండ్రులు ఎవరు లేకపోవడం తో త్వరగానే పెళ్లి చేసేసుకోడానికి సిద్దమయ్యారు. కాని వంశీ ఫ్రెండ్స్ వద్దని వారించారు, అసలు ఆ అమ్మాయి ఇప్పటికే ఇద్దరు అనుమానాస్పదంగా మరణించిన పాడయిన బంగ్లాలో ఎందుకు ఉంటుందో తెలుసుకోకుండా, ఆ అమ్మాయి మనిషో కాదో తెలీకుండా పెళ్లి చేసుకోవద్దని అన్నారు". ఆ అమ్మాయి దెయ్యమో కాదో అన్న మాటలు నా చెవులలో మళ్ళి మళ్ళి వినిపిస్తున్నాయి. హర్రర్ సినిమా కి వచ్చానా ఏంటి అన్న సందేహం మొదలయింది. భయం ఉందని తెలిసాక ఒంటరిగా దెయ్యాల సినిమాలు చూడటం ఎప్పుడో మానేసాను. ఈ రోజు ఇంత రాత్రి ఒక్కడినే దెయ్యాల సినిమా చూడాల్సి వస్తుందని భయమేసింది. ఈ ఆలోచనలో పడి సినిమా చూడటం మర్చిపోయా. సినిమాలో పెళ్లి కి ముందు రోజు ఏదో పని ఉందని వంశీ స్నేహితులకి చెప్పి ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు, ఎంతకీ తలుపు తెరవకపోవడం తో కిటికీ దగ్గరకు వెళ్లి లోపలకి చూసాడు. లోపల ఏమి ఉందొ తేరా మీద అయితే చూపించలేదు గానీ వంశీ మొహం లో భయం నుదిటి మీద చెమట స్పష్టంగా కనిపించాయ్. ఆ భయంతోనే వేగంగా ఇంటి భయతకి వచ్చేసాడు. తను బయటకి రాగానే తలుపు తెరుచుకుంది. ఎవరో వెనక తరుముతున్నారని వంశీ పరిగెత్తాడు. పరిగెత్తే తొందరలో వంశీ కింద పడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తె తెల్లని చీరలో అదే అమ్మాయి చాలా బయంకరంగా ఉంది. భయమేసి కళ్ళు మూసుకున్నాను. కేవలం శబ్దాలు అరుపులు మాత్రం విన్పిస్తున్నాయి. అలా వింటుండగా కాసేపటికి నిద్ర పట్టేసింది. మెలుకువ వచ్చే సరికి సినిమా రావట్లేదు తెర మీద. హాలులో కూడా ఎవరు లేరు. ఒక్క సారిగా గుండె జల్లు మంది. ఆ వంశీ కి ఏం అయిందో ఆ దెయ్యాన్ని ఎవరు చెప్పారో అని ఆలోచించుకుంటూ గబా గబా బయటికి వచ్చేసాను. అన్నయ్యకి ఫోన్ చేసాను. రావటం కుదర్లేదురా నువ్ ఏదో ఒక ఆటోనో రిక్షానో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోమని గుండెల్లో బాంబు పేల్చాడు.

ఒక అరగంట వెతకగా వెతకగా ఒక రిక్షా వాడు దొరికాడు. వాడితో బేరమాడి మొత్తానికి ఒప్పించి ఊరికి బయలేదము రిక్షాలో. ఇంకో రెండు కిలో మీటర్లు ఉండగా చక్రం పంక్చర్ అయిందని దిగిపోమన్నాడు. కాసేపు ఏదో ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత ఒప్పించిన ఒప్పుకోక అలానే వెనక్కి వెళ్ళిపోయాడు. చేసేది లేక అలా పెద్ద పడ్డ చెట్ల మద్య ఉన్న రోడ్డు మీద నడవటం మొదలెట్టాను. ఆ రోజే తెలిసింది అమావాస్య కంటే పౌర్ణమి భయంకరంగా ఉంటుందని. వెన్నెల వాళ్ళ పెద్ద పెద్ద చెట్ల నీడలు రోడ్డు మీద పడి అటు ఇటు కదులుతూ చాలా భయంకరంగా ఉన్నాయి. పాదాల కింద అలా ఏదో కదులుతున్న ఫీలింగ్ తో నడవటం ఎంత కష్టమో తెలిసొచ్చింది. అడుగులు వేగంగా వేయటం తో చాలా త్వరగానే ఊరి దగ్గరకి వచ్చేసాను. కాని అసలు నడవాల్సింది ముందు ఉందని గుర్తొచ్చింది. మా ఊరి బయట కూడా ఒక పాడు బడ్డ బంగ్లా ఉంది. ఇందాక సినిమా చూసాక అది దాటడమే అసలు ఎత్తు. ఒక్కో అడుగు వేస్తున్న కొద్ది బంగ్లా దగ్గరవడం నా గుండె కొట్టుకోవడం వేగామవ్డం జరిగాయి. దురదృష్టం కొద్ది అలా చెరువవుతూ ఒక విషయం గమనించాను. ఎప్పుడు లేనిది ఆ బంగ్లాలో లైట్ వెలుగుతూ ఉంది. నాకు గుండె దడ ఎక్కువయింది. కాని ఆ బంగ్లాను దాటడం తప్పితే నాకు ఇంకో మార్గం లేదు. ఒక్కో అడుగు బంగ్లా వైపు వేస్తున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. ఆ బంగ్లా వెనుక ఉన్న చెట్టుకి ఉయ్యాల కట్టి ఉంది. అది గాలికి అటూ ఇటూ ఊగుతూ వెన్నల వెలుతురులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దెయ్యాల కి ఉయ్యాలకి ఉన్న సంబంధం ఏమిటో అలోచిన్చెంత తీరిక నా మెదడుకి అప్పుడు లేకుండింది.నా గుండె దడ శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది. ఆ బంగ్లాకు దూరంగా ఉన్న పొలాలలో కుక్కలు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తే అటు వైపుగా చూసాను. ఏవో దీపాలు కదులుతున్నట్లు కనపడింది. కోరిమి దెయ్యాల అలానే ఉంటాయని గుర్తొచ్చి కాళ్ళు చేతులలో వణుకు వచ్చేసింది. బంగ్లా ఇంకో పడి అడుగుల దూరంలో ఉండగా ఒక విషయం గమనించాను. ఆ ఇంటి బయట ఒక తెల్లటి కారు కనపడింది. ఆ ఇంటికి ఎవరో వచ్చుంటారు ఏదో పని మీద అని అనిపించి మనసు శాంతించింది. ఆ బంగ్లా దగ్గరకు రాగానే కిటికీ లోంచి లోపాలకి చూసాను. ఒక నిలువెత్తు అద్దం కనపడింది. దాని ఎదురుగా ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకుని మొహం మీదుగా పడిన జుట్టు ని దువ్వుకుంటూ కనపడింది. నా కాళ్ళు చేతులు కదలటం మానేశాయి. తలతిప్పేలోపు ఆ దెయ్యం/అమ్మాయి జుట్టు పక్కకి తీసి అద్దం లోంచి నన్నే చూసింది. ఒక్క సారిగా గుండె ఆగినంతపనయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఆ దెయ్యం నేను సినిమాలో చూసిన దెయ్యం ఒకటే. బయట ఉన్న కార్ వైపు చూసాను. అవను అది సినిమాలో వంశీ కార్. ఆ కార్ ఇక్కడ ఎందుకు ఉందో ఆ దెయ్యం ఈ బంగ్లాలోకి ఎలా వచ్చిందో అర్థం అవ్వటం లేదు.అంత అయోమయం గా ఉంది. చెమట తో వొల్లంత తడిసిపోయింది. వెనక్కి తిరగకుండా పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసాను. ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి టైం చూసాను. రెండు గంటలయింది. అలా రాత్రంతా నిద్ర పట్టక అలానే ఆలోచిస్తూ ఉండిపోయాను. దెయ్యాలు నిజంగానే ఉంటాయని నమ్మకం కుదిరింది. ఎపడు నిద్ర పోయానో తెలీదు గానీ తెల్లారాక ఆరు గంటలకు మెలుకువ వచ్చింది. ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తుంటే జిల్లా పేపర్ లో కనపడింది "మా ఊర్లో రామ్ భూపాల్ శర్మ తన సినిమా కి సేక్వేల్ తీద్దామని మా ఊరి బంగ్లని ఎంచుకున్నాడని, జనాలకి తెలీకుండా ఉండటానికి రాత్రిళ్ళు షూటింగ్ చేస్తున్నాడని, ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ మళ్ళి ఈ సినిమాలో కూడా చేస్తుంది" అని.

1, డిసెంబర్ 2010, బుధవారం

ఓ రేంజ్ కాయ!!...

Dont read it till the end if u are not ready to accept/digest my views at any point...

ఓ రేంజ్ కాయ!!...

CC camera లో లాగ camera రూం లో మూలాన ఉండి రూం ని అంత కవర్ చేస్తుంది. ఇంతలో 3lok కి మెసేజ్ వచ్చింది. చూస్తున్నాడు. camera మొబైల్ లోకి జూమ్ అయింది. A new message from Sriku " రేపు నైట్ సెకండ్ షో కి Orange కి వెళ్దామా!!"..3lok పేస్ పైన corner లో రెండు మేఘాలు వచ్చి(dreams ఎస్కోడానికి మూవీ లో వచ్చే మేఘాలన్నమాట)..ఆ మేఘాల్లో 3lok తనలో తానె ఉహించుకున్తున్నవి అన్ని కనిపిస్తున్నాయ్...."సినిమా బాలేదన్నారు కదా..ఎల్దామా!! వద్దా!!..కొత్త హీరోయిన్ బానే ఉందంట...సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయ్ కాబట్టి చుసేయోచ్చు. కాబట్టి అర గంట తీసేస్తే ఇంకో రెండు గంటలు. genelia ఎలానో నాకు నచ్చుతుంది కాబట్టి పర్వాలేదు. కాని సినిమా అర్థం అవట్లేదు అంటున్నారు??...ఆయన అర్థం కావని అపరిచితుడికి అలానే అన్నారు, Inception కి అలానే అన్నారు, ఖలేజ కి అలానే అన్నారు. అయినా నాకు అర్థం అయ్పోయాయి నచ్చేసాయి...నాకు అర్థం కాని సినిమాలు తీసే మగాడు ఇంకా పుట్టలేదు" అని కాలర్ ఎగరేసాడు ౩లొక్..."సినిమా చూసేయోచ్చు గాని పాటలు బాగుంటాయి కాబట్టి టికెట్స్ కష్టమయిన కూడా చూస్తె మల్లికార్జున లాంటి మంచి theatre లోనే చూడాలి అని లాక్ చేసేసాడు"...camera మళ్ళి సెల్ లోకి జూమ్ అయింది "నాకు రేపు ఓకే కాని బ్రమరంబ లోనే చూద్దాం" అని రిప్లై ఇచ్చాడు sriku కి...

ఇప్పుడు ౩లొక్ view లో స్టొరీ రన్ అవ్తుంది....

అలా ఆ రోజు గడిచిపోయింది. తర్వాతి రోజు ఆఫీసు లో మెయిల్స్ ద్వార అందరిని అడిగాము ఎవరెవరు వస్తారని. మార్నింగ్ లేవగానే చూడకోడని మొహాలు చూసిన మరో ఇద్దరు (ఫణి,ఫణింద్ర) చేతులెత్తారు. ఎత్తిన చేతులు మెయిల్స్ ద్వారా మాకు కనపడవని పాపం వాళ్లకి తెలీదు అనుకుంట మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు. మేమే ఫోన్ చేసి మొత్తానికి ఆ ఇద్దరితో మాట్లాడి బకరా లవ్వడానికి రాత్రి తొమ్మిది కల్లా theatre కి చేరుకున్నాము. కాని బాల్కనీ అయ్పోయాయి. కష్టపడకుండానే 40/- టికెట్స్ దొర్కేసాయి. మా కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా టికెట్ కౌంటర్ మూసేసాడు మాకు టికెట్స్ ఇవ్వగానే. ఓ అరగంట అలా అలా తిరిగి expectations ఎలాగో లేవు కాబట్టి మూవీ ని ఎంజాయ్ చేయొచ్చని లోపలకేల్లాము.

40/- లో కింద నుంచి మొదటి row...అసలే స్క్రీన్ పెద్దగ ఉంటది..అక్కడి నుంచి చూస్తుంటే సినిమాలో ఒకేసారి ఏదన్న ఒక మూల మాత్రమె కనపడ్తుంది. జీవితం లో ఎప్పుడు ఈ view లోంచి సినిమా చూసి ఎరగను. నెల టికెట్ కి మాకు పెద్ద తేడా లేదు సీటింగ్ తప్ప...ఇంతలో మూవీ స్టార్ట్ ఐంది. రామ్ "నేను జీవితాంతం లవ్ చేయలేను కాని వరల్డ్ గ్రేట్ లవర్ నేనే" అంటున్నాడు. అసలే రామ్ చరణ్ ని స్క్రీన్ మొత్తం ఉంటె చూడటం కష్టం అలాంటిది నేల టికెట్ దగ్గరి నుంచి చూడటం ఎంత కష్టమో అనుభవిస్తే కాని తెలీదు. రామ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే అందులో జాను(జేనేలియా) వచ్చింది. theatre మొత్తం విస్సిల్స్. జాను over action చూసాక విస్సిల్స్ ఆగడానికి ఎన్నో సెకండ్స్ పట్టలేదు..అలా కొంత సేపు సినిమా నడిచాక రామ్ జాను కి సింహాన్ని చూపిస్తాడు. జాను "నేను సింహాన్ని చూసాను" అని ఆనందం తట్టుకోలేక గంతులేస్తుంది. ఆ ఆనందాన్ని wild photography మాత్రమె తీసే హీరో గారు camera లో బందిస్తారు(అందంగా కాదు చెత్తగా).అప్పుడే అర్థమయిపోయింది సింహ తర్వాత నేను రివ్యూ రాయవలసి వచ్చే సినిమా ఇది అవ్తుంది అని.

పోనీ సాంగ్స్ అన్నా బాగున్నాయా అంటే అదీ లేదు. "రూబ రూబ సాంగ్" తప్పితే మిగతావి అన్ని బోరింగ్ గా ఉన్నాయి చూడటానికి. డాన్సు కూడా జస్ట్ ఓకే. సాంగ్స్ అంతగా బోర్ కొట్టడానికి అతి ముఖ్య కారణం రామ్ చరణ్ మూతి. సాంగ్స్ కి లిప్ మొమెంట్ చేస్తుంటే ఎంత వద్దనుకున్న అదే కనపడ్తుంది. ఇంకా తన నవ్వుగురించి, జాను డ్రెస్సింగ్ గురించి అసలు చెప్పుకోకవడమే బెట్టేరేమో. పప్పీ(బ్రాహ్మి) నేమ్ బాగుంది కాని అసలు నవ్వే రాదు సినిమా చూస్తున్నప్పుడు. సినిమా అంతా ఆర్య నుంచి inspire అయ్యి ఒక నమ్మలేని కాన్సెప్ట్ నమ్మించడానికి ట్రై చేసినట్లుగా ఉండి గాని ఏం చెప్పాలనుకున్నాడో నాకు కూడా అర్థం అవలేదు...ఇన్ని bad things మద్య సెకండ్ హీరోయిన్ కొంచం బాగానే ఉన్నా కూడా మనసు accept చేయలేకపోయింది...

సినిమా లో ఏం చెప్పాలనుకున్నాడో director విఫలమయ్యాడు అనడానికి రామ్ చరణ్ డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ చాలు.
రామ్ చరణ్, జెని తో ప్రేమ గురించి ఇలా అంటాడు. " అందరి ప్రేమ ఎదురుగ వస్తున్నా vehicle లైట్స్ చూసి మన కార్ డ్రైవ్ చేయడం లాంటిది అంత...రామ్ చరణ్ ప్రేమ తన హెడ్ లైట్స్ చూసి డ్రైవ్ చేయడం లాంటిది అంత...తక్కువ దూరం కనపడిన సేఫ్ గా ఉంటామంట"...ఏం చెప్పాలనుకున్నాడో తనకే తెలియాలి...వాళ్ళక్క బావ కొట్టుకుంటుంటే కొట్టుకోడం ఎందుకు విదిపోమంటాడు...ఈడి psychoism ముందు అసలు ఆర్య - 2 psychone కాదు...లవ్ మీద మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు ఈ సినిమా ని చూడకపోవడమే మంచిది....

నాకే ఈ సినిమా సరిగా అర్థం అవలేదు అనడానికి చెప్పుకోడానికి సిగ్గుగా ఉన్నా తప్పడం లేదు....

చివరి మాట: ఈ సినిమా చూసాక కూడా ఖలేజ,రోబో,బృందావనం బాలేదన్న వాడిని వొంగో బెట్టి రబ్బర్ స్టంప్ తో వీపు మీద గిభి గిభి అని గుద్దినా తప్పులేదు...

26, నవంబర్ 2010, శుక్రవారం

అందమైనది ఈ జీవితం

చలి కాలం అయినందు వల్ల తెల్లవారుజామున ఆరు గంటలకు కూడా సూరీడు ఇంకా కనపడటం లేదు. ఆకాశం అంతా నారింజ రంగు పులుముకుంది. ఒక వైపు సూరీడు వస్తున్నా కూడా చందమామ కి వెళ్ళాలని అనిపించడం లేదనుకుంట సూరీడు అందాన్ని చూసి ఇంకా నిండుగానే ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఆకాశం లో పక్షులు చద్రుడిని అందుకేనేందుకు గుమౌగా అటు వైపే వెళ్తున్నాయి. కోకిల పాటలు కోడి కూతలు నా మనసుని మేల్కొలుపుతున్నట్లుగా తోస్తుంది. వరి చేను పసుపు మరియు ఆకు పచ్చ రంగులతో మెరిసిపోతుంది. పొగ మంచు వల్ల ఏర్పడిన నీటి బిందువులు చెట్ల ఆకుల చివరన ఉండి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనలో దాచుకుని ఆ ప్రపంచాన్ని కన్పించి కనిపించకుండా చాలా చిన్నగా చూపిస్తున్నాయి.పొగ మంచు వల్ల దూరంలో ఉన్నవేమి కనపడటం లేదు. ప్రపంచం అంచు ఇంకో పది అడుగుల దూరంలో ఉన్నట్లుగా ఉంది. నా కాళ్ళకు చెప్పులు లేకపోవడంతో చేను గట్టు మీద అక్కడక్కడ ఉన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడో సుప్రభాతం వినపడుతుంది కాని నా దగ్గర రేడియో లేదన్న ఆలోచన నాకు రావటం లేదు. సుప్రభాతం అయిపోయిన తర్వాత "లాహిరి లాహిరిలో", "అందమే ఆనందమే", " భలే మంచి రోజు" లాంటి పాత పాటలు పల్లవి వరకు వచ్చి మారిపోతున్నాయి. ఆ రోజేంటో అన్ని నాకు ఇష్టమయిన పాటలే వస్తున్నాయి రేడియో లో. ఆ సమయంలో అక్కడ చెప్పులు లేకుండా ఎందుకూ నడుస్తున్నానో ఏం చేద్దామని వచ్చానో నాకేమి గుర్తురావటం లేదు. అయినా కాని అలా ప్రకృతి ని చూస్తూ గమ్యం తెలీని దారిలో నడుస్తూ ఉంటె చాలా ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న కొలను దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాను. చుట్టూ మామిడి చెట్లతో చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం. కొలనులోని నీళ్ళు ఈ అందాన్ని చూస్తూ అలలు అలలుగా వస్తూ ఎగిరే చేప పిల్లలతో అతలాడుతున్నాయి.


అలా కొంత దూరం నడిచే సరికి ఒక రైల్వే స్టేషన్ కనపడింది. చందానగర్ స్టేషన్ అని రాసి ఉంది. మళ్ళి ఆలోచనలు మొదలయ్యాయి, హైదరాబాదు లో ఇంత అందమయిన ప్రదేశాలు అదీ చందానగర్ దగ్గరలో ఎలా వచ్చాయా అని. లోపలి వెళ్ళాను.స్టేషన్ అంత ఖాళీగా ఉంది. అక్కడక్కడ కొంత మంది మాత్రమె కనిపిస్తున్నారు. ఇద్దరు ముసలి వాళ్ళు ప్రేమికులల కబుర్లు చెప్పుకుంటున్నారు అవతలి ప్లాట్ ఫారం మీద. స్టేషన్ లో అన్నౌన్సుమేంట్ కి బదులుగా చందమామ రావే పాట వస్తుంది. ఒక అమ్మ వల్ల బాబు కి గోరు ముద్దలు తినిపిస్తుంది. బాబు వాళ్ళ నాన్నతో కలిసి ప్లాట్ ఫారం నీడ ఉన్న వేయింగ్ మెషిన్ లో బరువు చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మని కూడా బరువు చూసికోమని బలవంతపెడుతున్నారు. అమ్మాయిలకయినా అమ్మలకైన బరువు చూసుకోడం అంటే ఎప్పటికయినా భయమే కదా అందుకే వద్దని చిన్న పిల్లలా మారం చేస్తుంది. ఆ బాబు అన్నం తినను అన్నాడో ఏం అన్నాడో గాని అమ్మకు తప్పలేదు చివరకి. నాకు వినపడలేదు గాని అలా అనే ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది, చిన్న వయసులో తన పిల్లలకి అన్నం తినిపించడానికి ఏమయినా చేస్తారు అమ్మలు. వాళ్ళ అమ్మ రూపాయి బిళ్ళ వేస్తుండగా బాబు మెషిన్ మీద ఒక కాలు వేసాడు. ఒక 20-30 kg లు ఎక్కువగా చూపించడం తో ఆ బరువు చూపించే పేపర్ ను ఎవరికీ ఇవ్వకుండా ఇది పనిచేయడం లేదు అని వాదిస్తూ సరదాగా గొడవ పడ్తూ దాచేస్తుంది. ఎందుకు అంత చూపించిందో ఆ బాబు కి కాక నాకు మాత్రమే తెల్సు. అమ్మ నాన్న పిల్లలు ఇలాంటి మనవ సంబందాలు ఎంత బావుంటాయో అని అన్కుంటూ నవ్వుకున్నాను. ఇంతలో భారి వర్షం పడేలా కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. అప్పుడప్పుడే కొంచం కొంచం గా గుర్తు వస్తుంది. ఏదో ప్రశాంతతను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చానని. ప్లాట్ ఫారం మీద ఇందాక ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారో తెలీదు గాని ఎవ్వరు లేరు. అంత చీకటిగా అయ్పాయింది. ఏమీ కనిపించడం లేదు. కేవలం చిరు వర్షం లో తడిసిన మట్టి వాసన మాత్రమె వస్తుంది.


చీకట్లో కూడా దూరంగా ఏదో వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు మెల్లిగా నా దగ్గరకే వస్తున్నట్లుగా ఉంది. బహుశా ట్రైన్ వస్తుందేమో అనుకున్నాను. కాని ఇంత చలిలో కూడా మొహం చాలా వేడిగా అయ్పోతుంది. కాళ్ళ కింద భూమి మాయమయ్యి నేను అనంతమయిన శూన్యం లోకి పడిపోతున్నాను. ఎందుకు పద్తున్ననో తెలిసే లోగా తల నేలను బలంగా తగిలింది. కళ్ళు తెరిచి చూసే సరికి మంచ పక్కన ఉన్నాను. ఇదంతా కల అని, ఇందాక కలలో కనిపించిన వెలుగు కిటికిలోంచి పడ్తున్న ఎండా అని, శూన్యం లోకి పడింది స్టేషన్ లోంచి కాదు మంచం మీద నుంచి అని అర్థం అయ్యాయి. జీవితం లో ఎలాంటి చిన్న చిన్న ఆనందాలను,మనుషుల మద్య అత్మీయతలను కోల్పోతున్నామో అనుకుంటూ పైకి లేచి గడియారం చూసాను. సమయం తొమ్మిదిన్నర. ఈ రోజు కూడా ఆఫీసు కి గంట ఆలస్యం. పగటికలలు నిజమవ్తయన్న చిన్న ఆశతో తుమాలు పట్టుకొని యాత్రిక జీవనం లోకి పరుగు తీశాను.

15, నవంబర్ 2010, సోమవారం

పూ.జా.భా - 2

అలా పూణే లో దిగిన మాకు వింత వింత మనుషులు తారసపడటం మొదలెట్టారు. పూణే లో జనాలు అలా ఉంటారో లేకపోతె మేము దిగిన వేళా విశేషమో గాని ఎవడికి వాడు ఒక్కో రకం. ఆ రకాలలో కొన్ని ఇక్కడ...

ఒకటో రకం:
ఈ ఒకటో రకం గాడు పొరపాటున మా ఇంటి ఓనర్ అయ్యి చచ్చాడు గాని ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి డబ్ చేసే భూతాల దిబ్బ,దెయ్యాల కోట లాంటి సినిమాలకో డబ్బింగ్ చెప్కోవాల్సిన వాడు. నేను మాములుగా పెద్ద వాళ్ళను వాడు వీడు అనను కాని వాడంటే మా అందరికి మసాల పెట్టని మిరపకాయ బజ్జి అంత మంట. వాడు మాట్లాడటం మొదలు పెడ్తే ఒక పట్టాన వదిలేవాడు కాదు. పూణే వెళ్ళిన కొన్ని రోజులకి తెలిసిన వాడు రూము ఉందంటే నచ్చితే అడ్వాన్సు ఇద్దామని డబ్బులు కూడా తీస్కోని వెళ్ళాము. ఆ రోజు అలా పరిచయమవ్వగానే ఇంట్లోకి పిలిచి కూర్చోమన్నాడు. రూము చాలా లక్కీ అందులో ఉన్నవాళ్ళకి అని చెప్పి ఒక డైరీ ఓపెన్ చేసాడు. ఆ డైరీ లో అప్పటి వరకు ఆ రూం లో ఉన్న వారందరి పేర్లు రాసుకున్నాను అని చెప్పి డైరీ మాకిచ్చాడు చూడమని. ఆ డైరీ లో పేరు దానికి US లో జాబు, UK లో జాబు, జర్మనీ లో పెళ్లి అని రాసి పెట్టుకున్నాడు. అలా అందరి గురించి ఒక్కో ఐదు నిమిషాలు చెప్పి మెదడు ని మెత్తటి పకోడీ తిన్నట్లు తినేసాడు. హమ్మయ్య లిస్టు అంత ఇప్పటికి అయినా అయింది అనుకుంటుండగానే ఇల్లు తో పాటు మీకు furniture కూడా ఇస్తాను అనడు. తింటే తిన్నాడు గాని బ్రహ్మచారులకి fridge, TV set ఎవరు ఇస్తారు అని ఆనంద పడ్డాము. ఇల్లు చూపించాదంకి తీస్కెళ్ళాడు. ఇల్లు పర్లేదు బానే ఉంది. fridge చూపిస్తాను అని చెప్పి తుప్పట్టిన బీరువా తలుపు తెర్చాడు. TIDE ad లో తెలుపుదనం చూసి అవాక్కయినట్లు మేము అవాక్కయ్యాము. అది బీరువా కాదు fridgee. తుప్పట్టడం మూలంగా,లోపల కూడా ఎమన్నా పెట్టుకోడానికి అరలు లేకపోడం మూలాన తేడ పోల్చుకోలేకపోయాము గాని కేవలం చల్లగా ఉన్న కారణంగా అది fridge ayindi. సరేలే fridge తో పనేమీ ఉంటుందిలే అని Blue diamond( అలంటి టీవీ కంపెనీ కూడా ఒకటి చరిత్రలో ఉండేదని అప్పుడే తెల్సింది) టీవీ ఆన్ చేసాము. మరాఠీ ఛానల్ ఏదో వస్తుంటే ఛానల్ మార్చడానికి చూసేసరికి టీవీ స్క్రీన్ రావడం మానేసింది. అప్పుడు మా ఓనర్ ఇది చిన్న ప్రాబ్లంమే ఒక దేబ్బెస్తే వస్తుంది అని టీవీ ని దభా దభా నాలుగైదు పీకాడు. అదే మనిషి అయుంటే చావనన్న చచ్చేది లేకపోతె return గా రెండు పీకేది. వేరే ఇల్లేమీ కనపడక అదే ఇంట్లో తప్పక దిగాము. రోజు సాయంత్రం గేటు సౌండ్ రాగానే మా డోర్ దగ్గర కోచేసేవాడు మీ కంపెనీ గురించి నాకు తెల్సు నేను ఒక టైం లో software అనేవాడు, ఏం అయినా ప్రాబ్లం ఉంటె చెప్పండి నేను చూస్కుంటాను అని మాటలతో మా మైండ్ తినీసేవాడు. ఒక్కో సారి వండున్తున్న వంటలు మాడిపోతున్న కూడా వదిలేవాడు కాదు.

రెండో రకం:
జుట్టు బాగా పెరిగింది తర్వాతి రోజు నుంచి ఆఫీసు కి వెళ్ళాలి అని hair saloon కి వెళ్ళాము హెయిర్ కట్ చేయించడానికి. cutting చేయమని కూర్చున్నాము. వాడు నాకు మూడ్ లేదు అన్నాడు. వచ్చి రాని హిందీ లో నేను చెప్పింది అర్థం కాక అలా అన్నాడో లేక నేను తప్పుగా విన్నానో తెలీక పక్కన ఉన్నవాదిదో హెయిర్ కట్ చేయమని చెప్పించా. మళ్ళి మూడ్ లేదు అన్నాడు. ఇక్కడ hyderabad లో అయితే షాప్ కట్టేసే టైం అవ్తున్న కూడా ఎవరన్న వస్తే cutting చేసాకే షాప్ మూస్తారు. ఈడేంటి మూడ్ లేదంటాడు అని expression లేని షాక్ తో బయటికి వచ్చేసాము.

మూడో రకం:
మేము పూణే వెళ్ళిన కొత్తలో పొరపాటునో గ్రహపాతునో మా నలుగురిలో ఎవడికో అరటి పళ్ళు తినాలనిపించింది. మాలో ఒకడు అరటి పళ్ళ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆడ మనిషి అమ్ముతుంది. ఎంత అన్నము 20/- డజన్ అంది. సరే అని 10/- ఇచ్చి అర డజన్ ఇమ్మన్నాము. ఇవ్వనంది. డజన్ 20/- అయితే అర డజన్ 10/- కదా అన్నాము. అయతే అవ్వొచ్చు గాని నేను మాత్రం ఇవ్వను అంది. చేసేదేమీ లేక పూణే లో ఉన్నన్నాళ్ళు ఇంకోసారి అరటి పళ్ళ జోలికి వెళ్ళలేదు.

ఇలా ఎన్నో రకాలు కలిపి పూ.జా.భా - 2 . కుదిరితే ఇంకొన్ని రకాలు పు.జా.భా - 3 లో....