రాజేంద్ర నగర్ లో మొదటి బస్సు కోసం ఉదయం ఏడు గంటలకు బస్సు స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. బస్సు ఎక్కుతుండగా కండక్టర్ డ్రైవర్ స్మైల్ ఇచ్చి హాయ్ చెప్పారు. నేను కూడా హాయ్ చెప్పి కూర్చున్నాను. నేను తప్ప ఎవరు ఎక్కలేదు బస్సు లో. ఎందుకంటే రాజేంద్ర నగర్ లోని NG Ranga PG college లో స్టూడెంట్స్ అంత త్వరగా లెగడం అంత పొద్దున్నే ఫస్ట్ బస్సు క్యాచ్ చేయడం చిత్రమే అవ్తుంది. అందుకేనేమో మొదటి రోజు నేను ఆ బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ చిత్ర విచిత్రంగా చూసి ఎక్కడ్నుంచి వస్తున్నావ్ ఎక్కడ్కేల్తున్నావ్ లాంటి ప్రశ్నలతో పాటు పుట్టు పూర్వోత్తరాలు తెలుస్కోని గానీ టికెట్ ఇవ్వలేదు. అలా రెండు రోజులు నిద్ర లేచాక వాళ్ళు చూసిన మొదటి మొహం నాదే అవ్వడం తో మూడో రోజునే నాకు స్మైల్ హాయ్ చెప్పేసెంత పరిచయం కల్గింది. అంత పొద్దున్నే ఆ బస్సు మరి నువ్వెందుకు ఎక్కుతున్నవని మీరు కూడా అన్కోవచ్చు. చెప్తా..అది కూడా చెప్తా...కాస్త ఆగండి...
చక్రాలు...జంతికలు....సుడి గుండాలు...
ఏదోటి సాదించాలి అని IIT లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ అయ్యా గానీ. సాదించాల్సిన సీట్ IIT లోనో IIIT లోనో ఎంసెట్ లోనో డిసైడ్ అవడం లోనే ఆ సంవత్సరం అంత గడిచిపోయింది. రెండు బెంజీన్ లను వాటర్ లో కలిపి సాల్ట్ తగిలిస్తే ఏం అవుతుంది అన్న ప్రశ్నకు నా పాక శాస్త్ర ప్రావిణ్యం తోడు చేసి కాంటినెంటల్ సూప్ అవ్తుంది అని రాయడం తో IIT exam దొబ్బేసింది. వచ్చిన invigilator అతిక తెలివి వల్ల AIEEE exam కూడా తన్నేసింది. (OMR షీట్ లో పెన్ను తోనే నింపాలని ఒక రూల్ ఏడ్చింది. ఒక సెకండ్ లో ఆన్సర్ చేయడం బాగా అలవాటయిన చేయి కదా ఒక సెకండ్ లోనే పేరు రాసేద్దామని పెద్ద పెద్ద అక్షరాలతో రాసేసా. రాసాక అర్థం అయింది రాయాల్సిన చోట రాయకుండా ఇంకో చోట రాసా అని. invigilator కి చెప్తే నేను చూస్కుంటా అని చెప్పి నా పెన్ను OMR sheet అన్ని తీస్కోని ఎటో ఎల్లిపోయాడు. అర గంట తర్వాత వచ్చి నా OMR sheet తెచ్చి ఇచ్చాడు. ఉలితో ఒక శిల్పాన్ని చెక్కినట్లు, కత్తితో పెన్సిల్ ని చెక్కినట్లు నా OMR sheet ని blade తో చెక్కేసాడు. గుండె ఆగినంత పని అయింది. ఏం చేయాలో తెల్సుకునే లోపు పుణ్య కాలం కాస్త అయిపోయి రాహు కాలం కూడా వచ్చేసింది). ఒక సంవత్సరం వేస్ట్ అవకుండా ఉన్న ఒక్క అవకాశం ఎంసెట్. అది కూడా నన్ను తన్నకుండా జాగ్రత్త పడి నేను దాని తోక ని తొక్కడం తో మంచి ర్యాంకు JNTU లో సీటు రెండు వచ్చేసాయి. జాయిన్ అయ్యే ముందు యూనివర్సిటీ లో జాయిన్ అవ్తున్నావ్ రాగ్గింగ్ ఉంటుంది అని చాలా మంది హెచ్చరించారు నా పరిస్తితి ని గురించి చాలా మంది చర్చించారు కూడా. కాని మొదటి రెండు రోజులు కాలేజీ కి బయం బయం వెళ్లాను గానీ అసలు ఒక సీనియర్ కూడా ఎదురుపడలేదు. రాగ్గింగ్ ని కూకటి వేళ్ళతో సహా పీకేసం అని ప్రిన్సిపాల్ మొత్తుకుంటుంటే నమ్మకపోతే ఫీల్ అవతాడని నమ్మేస కూడా. అలా మూడో రోజు రాగ్గింగ్ ఎలానో లేదు కదా అని జీన్స్ రంగు రగుల షర్టు ఒకటి ఏసి కోఠి బస్సు స్టాప్ రావడం తో కళ్ళు తుడుచుకుంటూ బస్సు దిగేసాను. ( బస్సు దిగుతున్నందుకు వచ్చిన కన్నీళ్లు కాదు అవి రాగ్గింగ్ లేని అంత మంచి కాలేజీ లో సీటు దొరికినందుకు కలిగిన ఆనంద భాష్పాలు) . ఇంతకీ అంత త్వరగా కాలేజీ కి ఎందుకు అంటే రెండు కారణాలు ఉన్నాయ్. రాజేంద్ర నగర్ నుంచి కోఠి కి ఎల్లాలంటే గంట. అక్కడి నుంచి JNTU ki గంట. గంట ముందు కాలేజీ కి వెళ్తే రాగ్గింగ్ బారిన పడకుండా లోపలకేల్లిపోవచ్చని ఎవడో చచ్చు వెదవ ఇచ్చిన అయిడియ. గంట ముందు వెళ్తే ఆ టైం రాగ్గింగ్ చేయించుకోడం కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు కదా అన్న ఆలోచన ఆడికి రాలేదు నాకు రాలేదు. 7 - 8 రాజేంద్రనగర్ తో కోఠి, 8 - 9 కోఠి - JNTU , 9 - 10 డోర్ లు ఎస్కుని classroom లో కూర్చోడం. ఇది నా ప్లాను. కాని నేను హైదరాబాదు లో అడుగు పెట్టడం అదే మొదటి సారి అవడం తో అంత కొత్తగా భయంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్న బస్సులలోనే ప్రయాణించాలి. బస్సు మీద నెంబర్ సరిగా కనపదేలోపులే బస్సు వేల్లిపోఎవి. ఎక్కడికేల్లలో తెలిసిన కూడా ఏ నెంబర్ బస్సు ఎక్కలో తెలిసి చచ్చేది కాదు. హైదరాబాద్ లో అడుగు పెట్టగానే మా అన్నయ్య ఒకటే మాట చెప్పాడు. 95P, 225A ఈ రెండు నెంబర్లు గుర్తు పెట్టుకోమన్నాడు. చిన్నప్పుడంతా తెలుగు మీడియం లో చదవడం మూలాన A,B,C,D లను నేను మొదటి నుంచి పట్టించుకునే వాడిని కాదు. కోటి - రాజేంద్రనగర్ మద్యలో 95 బస్సు ఎక్కాలి. కోటి - JNTU మద్యలో 225 బస్సు ఎక్కాలి. ఈ రెండు నెంబర్లను గుర్తుపెట్టుకొని మొదటి రెండు రోజులు తిరిగేసాను.
మొత్తానికి మూడో రోజు 225 బస్సు దిగి JNTU లోకి అడుగు పెట్టా. రెండు రోజులు రాగ్గింగ్ లేకపోవడం తో నాకు తెలీకుండానే కాలర్ వెనక్కేల్లింది. పైన పాకెట్ లో పెన్. చేతిలో ఒకటే ఒక్క notebook. కింద jeans, పైన రంగుల చొక్కా. జూనియర్ ని అని ఎవరు ఈజీగా గుర్తుపట్టకోడదు అని ఇన్షర్టు కూడా చేసేసా....త్వరగా వచ్చేయడం వల్ల ఏం చేయాలో తెలీక ఆలోచిస్తున్న సందర్భం లో కాంటీన్ కనపడింది. ఆకలేస్తుంది. కాంటీన్ కి జునిఒర్స్ వేల్లకోడదు అని చెప్పారు.. బ్యాక్ గ్రౌండ్ లో మన్మధుడు సినిమా లోని "వద్దురా వద్దురా వేల్లెల్లి గోతిలో పడోద్దురా " అన్న పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపించింది. అయినా నన్నెవరు గుర్తుపడతారులే అన్న దైర్యం ముందుకి నడిపిస్తుంది. లోపలకెల్లి బోండాలు తీసుకొని తింటున్నా.."వద్దురా వద్దురా" మళ్ళి వినిపించింది. అస్సలు గుర్తు పట్టకోడదు అని చెస్ట్ ముందుకు పెట్టి మరీ తింటున్నా. బాలయ్య ని బీట్ చేసే నా ఓవర్ యాక్షన్ చూసి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు నా దగ్గరకి వచ్చారు. సీన్ కట్ చేస్తే నేను మాస్ సినిమాలో వాలు కల్ల వయ్యారి పాట పాడుతున్నాను. మళ్ళి సీన్ కట్ చేస్తే ఇంద్ర పాటకి డాన్సు..టన్ ట టన్ ట టన్టన్..టన్టన్ టన్ ట టన్ ట టన్టన్...దాయి దాయి దామ్మా పాటకి డాన్సు చేస్త్నాను. సీన్ కట్ చేస్తే inshirt తీసేసి ప్యాంటు పైకి మడత పెట్టి. హోయ్లేస్సా హోయ్లేస్సా కి సోలో పెర్ఫార్మన్స్ ఇస్తున్నా. ఆ పాట తెలీదా. అదే అండీ కమల్ హాసన్ చేపలు పట్టేవాడిలా సోలో డాన్సు చేస్తాడు. ఆ శుభ సంకల్పం. ఆ నంది అవార్డు పెర్ఫార్మన్స్ చూసిన ఆ ముగ్గురు సీనియర్లు జీ తెలుగు లోని ఓంకర్ల చాలా బా చేసావు చాలా భా చేసావు అని పొగిడి పైన జేబులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. ఆ ఆనందం లో నా కల్ల వెంట వచ్చిన ఆనంద భాష్పాలను తుడుచుకొని ఇంటికేల్లడానికి 15rupees అవుతాయి, డబ్బుల్లేవ్ వెళ్లి రావడానికి ఓ 30 రూపాయలు ఇమ్మని ప్రాదేయపడ్డా. నా హృదయంతరాలలో నుంచి లావాల ఉబుకుతున్న ఆనంద భాష్పాలను చూసి హృదయం ద్రవించి ఓ 30 రూపాయలు చేతిలో పెట్టి నన్ను వదిలేసారు. జజ్జనక జనారే జజ్జనక జనారే అని బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంది. అదేంటి డబ్బులు దొబ్బెస్తే sad మ్యూజిక్ రావాలి గానీ ఇదేంటి ఈ పాట.మతిలేని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా. అక్కడే మీరు ఉప్పులో కాలేసారు. మీరు కూడా ఆ వెర్రి సీనియర్ లలా (సీనియర్ లు ఎప్పుడు జూనియర్ లకు లోకువే అని నా ఉద్దేశ్యం)నా intellegence ని క్యాచ్ చేయలేదు. వెళ్ళడానికి పదిహేను రూపాయలు. మరి ఇంకో పదిహేను ఎందుకు. ఎందుకు ఎందుకు.
మళ్లీ చక్రాలు...జంతికలు...చేగోడీలు..
ఇంటర్ హాస్టల్ పెట్టిన్డల్లా తిని జిహ్వ చాపల్యం చచ్చి గుర్రుగా నిద్రపోతున్న నాలోని కుంభ కర్ణుణ్ణి తట్టి లేపింది పానీ పూరి. ఇంకా అపట్లో పానీ పూరి ఊర్లల్లోకి రాలేదు. మొదటి సారి హైదరాబాద్ లో అడుగు పెట్టిన రోజున మొదటి సారిగా తిన్నాను. ఆహా. గుండ్రని పూరి. అందులో వేడి వేడి ఆలు కూర. పుల్ల పుల్లని కారం కారం గా ఉండే నీటిలో ముంచి నోట్లో పెట్టుకుంటే ఉంటది నా సామి రంగా. ఆ రుచి కి మొదటి సారి డంగ్ అయిపోయాను. ఆ రోజు నుంచి రోజూ పానీ ఊరి తినకుండా ఉండలేక పోయేవాడిని. అలా పానీ పూరి కి బానిసయిన నేను, తెచ్చిన డబ్బులన్నీ ఆ పానీ తాగుడు కి తగలేసేవాడిని.
ఆ రోజూ కాలేజీ అయ్పోయాక ఉన్న ముప్పయి రూపాయలలో పదిహేను రూపాయలు కి సరిపడా పానీ పూరి తినేసి బస్సు స్టాండ్ లో 225 బస్సు కోసం వెయిట్ చేస్తున్న. అంతలో 225 C/A బస్సు వచ్చింది. ఎక్కేసి కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు కండక్టర్. తిన్నగా కోఠి అని చెప్పొచ్చు కదా నేను. అలా చెప్తే ఈ స్టొరీ రాయడం ఎందుకు. లాస్ట్ స్టాప్ అని స్టైల్ గా చెప్పా. టికెట్ చేతిలో పెట్టాడు. బాగా పానీ పూరి లాగించడంతో నిద్ర ముంచుకొచ్చింది. పడుకొని లేచేసరికి కండక్టర్ లాస్ట్ స్టాప్ అని అరుస్తున్నాడు. గబా గబా దిగిపోయా. కాని అది కోఠి కాదు. దూరంగా చార్మినార్ కనపడ్తుంది. అప్పుడు అర్థం అయింది నేను దిగింది చార్మినార్ దగ్గర అని. ఇన్నాళ్ళు ఇన్నిన్ని బుక్స్ చదివాను గానీ A,B,C,D ల వేల్యూ అర్థం అవ్వలేదు. 225A అంటే కోఠి కి, 225 C/A అంటే చార్మినార్ కి వెళ్తుంది అని అర్థం అయింది. మొదటి సారి చార్మినార్ అలాంటి పరిస్తితుల్లో, అనుకోకుండా చేతిలో డబ్బులు కూడా లేకుండా చూస్తానని. తప్పు బస్సు ఎక్కితే ఎక్కాను గానీ చార్మినార్ ని చూసనన్న ఆనందం మాత్రం అలాగే ఉండిపోయింది. చార్మినార్ బస్సు స్టాప్ కి వెళ్లి కోఠి ఎల్లాలంటే ఎలా అని ఒకడిని అడిగాను. ఈ బస్సు ఎక్కేయ్ అని ఒక బస్సు చూపించాడు. పరిగెత్తుకుంటూ ఎల్లి ఎక్కేసా. హమ్మయ్య ఎలాగయినా కోఠి కి ఎల్లిపోతున్నా పెద్ద ప్రాబ్లం లేకుండా అనుకుంటున్న టైం లో కండక్టర్ వచ్చి "టికెట్" అన్నాడు. నేను "కోఠి" అన్నాను. "పెద్ద పెద్ద చదువులు చదువుతారు గానీ ఏ బస్సు ఎక్కలో కూడా తెలీదు. ఇది కోఠి ఎల్లదు secundrabaadu ఎల్లుతుంది" అని నన్ను తిట్టినా తిట్టు తిట్టకుండా తిట్టి కాచిగూడ లో దింపేసి ఎల్పోయాడు.ఉన్నవి 7 రూపాయలు, కాని వాటితోనే కాచిగూడ to కోఠి..కోఠి to రాజేంద్ర నగర్ ఎల్లాలి. ఎలా ఎల్లాలో తెలీదు, ఎల్లదానికి డబ్బుల్లేవు. ఏం చేయాలో తెలీక టెన్షన్ వచ్చేసింది. ఏం చేయాలో తెలీక రోడ్ పక్కన కుర్చుండిపోయా. జీవితంలో పానీ పూరి తినకోడదని శపథం చేస్తున్న సమయానికి దూరంగా వేగంగా వెళ్తున్న ఒక బస్సు మీద కోఠి అని కనపడింది. కోఠి నుంచి రాజేంద్ర నగర్ ఎల్లదానికి డబ్బులు లేకపోయినా కూడా కోఠి ఎల్లడం ముఖ్యం తర్వాత మనీ కోసం ఏదోటి చేద్దామని ఆ బస్సు వెనకాల పరిగెట్టడం మొదలెట్టా. దీనబ్బ జీవితం ఇంతలా ఎప్పుడు పరిగేట్టలేదు. మగధీర సినిమాలో గుర్రం వెనక రాం చరణ్ పరిగేట్టినట్లు, పోలీసు లు లాఠి ఛార్జ్ చేస్తుంటే జనాలు పరిగేట్టినట్లు పిచ్చ పిచ్చగా పరిగెత్తా. చివరకి పరిగెత్తి పరిగెత్తి బస్సు ఎక్కేసా. ఎక్కి ఎక్కగానే బస్సు ఆపేసాడు. కండక్టర్ కోపంగా వచ్చి " అంత పరిగెత్తుకుంటూ ఎక్కకపోతే నెక్స్ట్ బస్సు ఎక్కవచ్చు కదా!! ఇంతకీ ఎక్క్కడికి వెళ్ళాలి" అన్నాడు. "కోఠి" అన్నాను. "చదువుకుంటే ఉన్న మతి పోయిందంట...నువ్ బస్సు ఎక్కడానికి కోఠి వరకు బస్సు వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేశావు..దిగు దిగు ఇదే కోఠి" అన్నాడు. రూపాయి ఖర్చు లేకుండా చార్మినార్ తిరిగొచ్చిన నా adventure ను గుర్తు చేసుకుంటూ రాజేంద్ర నగర్ ఎళ్ళ డానికి 95 బస్సు ఎక్కా. విండో సీట్ లో కుర్చుని కిటికీ లోంచి బయటకి చూస్తున్నా. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మని "అమ్మ పానీ పూరి కావాలి" అని ఏడుస్తున్నారు. అది చూసి గుండె ఆగినంత పని అయింది. వెంటనే బస్సు దిగి మళ్ళి బోర్డు చూసా. అది 95 కాదు, 95P , నేను ఎక్కాల్సిన బస్సు అదే అని రెండు సార్లు చూసి confirm చేసుకున్న తర్వాత మళ్ళి బస్సు ఎక్కా .
8, ఏప్రిల్ 2011, శుక్రవారం
16, ఫిబ్రవరి 2011, బుధవారం
ఓ వెన్నెల రాత్రి
నేను చిన్నప్పుడు భయం ఉందొ లేదో తెల్సుకోడానికి దెయ్యాల సినిమాలు ఒంటరిగా చూడటానికి ప్రయత్నించే వాడిని. అలా చూసి చూసి మొత్తానికి మునిగింది ఏమిటంటే నాకు భయం ఉందని. భయం ఉన్నా కూడా నిజంగా దెయ్యాలు ఉంటాయ ఉండవా అన్న ఆత్రుత మాత్రం అలాగే ఉండిపోయింది. మా మామ్మ వాళ్ళ ఊరు చిన్న పల్లెటూరు కావడం వలన వేసవి లో అక్కడ ఉన్నప్పుడు అందరితో పాటు ఆరు బయట పడుకోవాల్సి వచ్చేది. అలా పడ్కున్నప్పుడు రాత్రిళ్ళు దూరంగా ఏవో కదులుతున్నట్లు వింత ఆకారాలు కనిపించేవి. ఒకరికి కనపడినపుడు ఇంకొకరికి కనపడేవి కావు అందుకే అవి నిజమో కావో అని ఎవరు తేల్చి చెప్పలేకుందే వారు. దెయ్యాలు నిజంగానే ఉనయన్న నిజాన్ని తెల్సుకోడానికి కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన తోడ్పడింది. ఆ సంఘటన ఇలా....(దెయ్యాలు లేవనుకున్న వాళ్ళు, ఓ వెన్నల రాత్రి అనగానే ఇదేదో రొమాంటిక్ టైపు అని ఎగేస్కోని వచ్చిన వాళ్ళు ఇది చదవకపోవటమే మంచిదని నా ఉద్దేశం తర్వాత మీ ఇష్టం..)
కొన్నేళ్ళ క్రితం మా మామ్మ వాళ్ళ ఊరులో ఉన్నప్పుడు ఒక రోజు కరెంటు కోట ఉండటం తో బోర్ కొట్టి దగ్గర ఉన్న సినిమా హాలులో ఏదో ఒక సినిమా కి వెళ్దామని అనుకున్నాను. దగ్గర అంటే మరీ అంత దగ్గరేమి కాదు. మా ఊరు నున్చిఎనిమిది కిలో మీటర్ల దూరం లో మరొక ఊరు ఉంది అక్కడకు వెళ్తే గానీ సినిమా హాలులో సినిమా చూడలేం. అందులో రెండు కిలో మీటర్ల వరకు పొలాల మద్య చెట్ల మద్య నడిచి వెళ్లి అక్కడ నుంచి రిక్షా పట్టుకుంటే సినిమా హాలుకి చేరుకోవచ్చు. త్వరగా కరెంటు వచ్చే అవకాశం లేకపోవడం, అన్నయ్య పని మీద అదే ఊరు బైక్ మీద వెళ్తుండటం తో సెకండ్ షో అయినా సినిమా కి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. అన్నయ్య కి అక్కడ రెండు మూడు గంటలు పని ఉండటం తో వచ్చేటప్పుడు అన్నయ్యతో వచ్చేయోచ్చని అంతరాత్మ లెక్కించి చెప్పింది. అన్నయ్య నన్ను హాలు దగ్గర తొమ్మిది గంటలకల్లా దింపేసి వెళ్ళిపోయాడు. టికెట్ కౌంటర్ దగ్గర అసలు జనాలు లేరు. టికెట్ తీస్కోని లోపలి వెళ్లాను. హాలు మొత్తం లో అక్కడక్కడ ఇద్దరో ముగ్గురో ఉన్నారంటే. కేవలం నా సీట్ దగ్గర మాత్రమే ఫ్యాన్ తిరుగుతుంది చాల నెమ్మదిగా. దాని పైననే లైట్ ఉండటం తో నీడ కూడా పెద్ద ఫ్యాన్ లాగ హాలు అంత తిరుగుతుంది. లైట్ ఆపకుండానే సినిమా స్టార్ట్ చేసేసాడు.
"ఇతని పేరు వంశీ. ఇక్కడకు వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్" అని బాక్గ్రౌండ్ లో స్టొరీ చెప్పడం మొదలెట్టాడు, ఖాకి కలర్ డ్రెస్ ఎస్కున్న ఒక నది వయస్కుడి ఫోటో ఒకటి స్క్రీన్ మీద చూపిస్తూ. "ఈ అమ్మాయి ఇదే ఊరి బయట ఉండే పడు బడ్డ బంగలో ఈ మద్య నుంచే ఉంటుంది." అని స్క్రీన్ మీద ఒక అందమయిన అమ్మాయి బొమ్మ చూపించాడు. " ఈమెను చూడగానే తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇద్దరికీ తల్లి దండ్రులు ఎవరు లేకపోవడం తో త్వరగానే పెళ్లి చేసేసుకోడానికి సిద్దమయ్యారు. కాని వంశీ ఫ్రెండ్స్ వద్దని వారించారు, అసలు ఆ అమ్మాయి ఇప్పటికే ఇద్దరు అనుమానాస్పదంగా మరణించిన పాడయిన బంగ్లాలో ఎందుకు ఉంటుందో తెలుసుకోకుండా, ఆ అమ్మాయి మనిషో కాదో తెలీకుండా పెళ్లి చేసుకోవద్దని అన్నారు". ఆ అమ్మాయి దెయ్యమో కాదో అన్న మాటలు నా చెవులలో మళ్ళి మళ్ళి వినిపిస్తున్నాయి. హర్రర్ సినిమా కి వచ్చానా ఏంటి అన్న సందేహం మొదలయింది. భయం ఉందని తెలిసాక ఒంటరిగా దెయ్యాల సినిమాలు చూడటం ఎప్పుడో మానేసాను. ఈ రోజు ఇంత రాత్రి ఒక్కడినే దెయ్యాల సినిమా చూడాల్సి వస్తుందని భయమేసింది. ఈ ఆలోచనలో పడి సినిమా చూడటం మర్చిపోయా. సినిమాలో పెళ్లి కి ముందు రోజు ఏదో పని ఉందని వంశీ స్నేహితులకి చెప్పి ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు, ఎంతకీ తలుపు తెరవకపోవడం తో కిటికీ దగ్గరకు వెళ్లి లోపలకి చూసాడు. లోపల ఏమి ఉందొ తేరా మీద అయితే చూపించలేదు గానీ వంశీ మొహం లో భయం నుదిటి మీద చెమట స్పష్టంగా కనిపించాయ్. ఆ భయంతోనే వేగంగా ఇంటి భయతకి వచ్చేసాడు. తను బయటకి రాగానే తలుపు తెరుచుకుంది. ఎవరో వెనక తరుముతున్నారని వంశీ పరిగెత్తాడు. పరిగెత్తే తొందరలో వంశీ కింద పడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తె తెల్లని చీరలో అదే అమ్మాయి చాలా బయంకరంగా ఉంది. భయమేసి కళ్ళు మూసుకున్నాను. కేవలం శబ్దాలు అరుపులు మాత్రం విన్పిస్తున్నాయి. అలా వింటుండగా కాసేపటికి నిద్ర పట్టేసింది. మెలుకువ వచ్చే సరికి సినిమా రావట్లేదు తెర మీద. హాలులో కూడా ఎవరు లేరు. ఒక్క సారిగా గుండె జల్లు మంది. ఆ వంశీ కి ఏం అయిందో ఆ దెయ్యాన్ని ఎవరు చెప్పారో అని ఆలోచించుకుంటూ గబా గబా బయటికి వచ్చేసాను. అన్నయ్యకి ఫోన్ చేసాను. రావటం కుదర్లేదురా నువ్ ఏదో ఒక ఆటోనో రిక్షానో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోమని గుండెల్లో బాంబు పేల్చాడు.
ఒక అరగంట వెతకగా వెతకగా ఒక రిక్షా వాడు దొరికాడు. వాడితో బేరమాడి మొత్తానికి ఒప్పించి ఊరికి బయలేదము రిక్షాలో. ఇంకో రెండు కిలో మీటర్లు ఉండగా చక్రం పంక్చర్ అయిందని దిగిపోమన్నాడు. కాసేపు ఏదో ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత ఒప్పించిన ఒప్పుకోక అలానే వెనక్కి వెళ్ళిపోయాడు. చేసేది లేక అలా పెద్ద పడ్డ చెట్ల మద్య ఉన్న రోడ్డు మీద నడవటం మొదలెట్టాను. ఆ రోజే తెలిసింది అమావాస్య కంటే పౌర్ణమి భయంకరంగా ఉంటుందని. వెన్నెల వాళ్ళ పెద్ద పెద్ద చెట్ల నీడలు రోడ్డు మీద పడి అటు ఇటు కదులుతూ చాలా భయంకరంగా ఉన్నాయి. పాదాల కింద అలా ఏదో కదులుతున్న ఫీలింగ్ తో నడవటం ఎంత కష్టమో తెలిసొచ్చింది. అడుగులు వేగంగా వేయటం తో చాలా త్వరగానే ఊరి దగ్గరకి వచ్చేసాను. కాని అసలు నడవాల్సింది ముందు ఉందని గుర్తొచ్చింది. మా ఊరి బయట కూడా ఒక పాడు బడ్డ బంగ్లా ఉంది. ఇందాక సినిమా చూసాక అది దాటడమే అసలు ఎత్తు. ఒక్కో అడుగు వేస్తున్న కొద్ది బంగ్లా దగ్గరవడం నా గుండె కొట్టుకోవడం వేగామవ్డం జరిగాయి. దురదృష్టం కొద్ది అలా చెరువవుతూ ఒక విషయం గమనించాను. ఎప్పుడు లేనిది ఆ బంగ్లాలో లైట్ వెలుగుతూ ఉంది. నాకు గుండె దడ ఎక్కువయింది. కాని ఆ బంగ్లాను దాటడం తప్పితే నాకు ఇంకో మార్గం లేదు. ఒక్కో అడుగు బంగ్లా వైపు వేస్తున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంది. ఆ బంగ్లా వెనుక ఉన్న చెట్టుకి ఉయ్యాల కట్టి ఉంది. అది గాలికి అటూ ఇటూ ఊగుతూ వెన్నల వెలుతురులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దెయ్యాల కి ఉయ్యాలకి ఉన్న సంబంధం ఏమిటో అలోచిన్చెంత తీరిక నా మెదడుకి అప్పుడు లేకుండింది.నా గుండె దడ శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది. ఆ బంగ్లాకు దూరంగా ఉన్న పొలాలలో కుక్కలు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తే అటు వైపుగా చూసాను. ఏవో దీపాలు కదులుతున్నట్లు కనపడింది. కోరిమి దెయ్యాల అలానే ఉంటాయని గుర్తొచ్చి కాళ్ళు చేతులలో వణుకు వచ్చేసింది. బంగ్లా ఇంకో పడి అడుగుల దూరంలో ఉండగా ఒక విషయం గమనించాను. ఆ ఇంటి బయట ఒక తెల్లటి కారు కనపడింది. ఆ ఇంటికి ఎవరో వచ్చుంటారు ఏదో పని మీద అని అనిపించి మనసు శాంతించింది. ఆ బంగ్లా దగ్గరకు రాగానే కిటికీ లోంచి లోపాలకి చూసాను. ఒక నిలువెత్తు అద్దం కనపడింది. దాని ఎదురుగా ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకుని మొహం మీదుగా పడిన జుట్టు ని దువ్వుకుంటూ కనపడింది. నా కాళ్ళు చేతులు కదలటం మానేశాయి. తలతిప్పేలోపు ఆ దెయ్యం/అమ్మాయి జుట్టు పక్కకి తీసి అద్దం లోంచి నన్నే చూసింది. ఒక్క సారిగా గుండె ఆగినంతపనయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఆ దెయ్యం నేను సినిమాలో చూసిన దెయ్యం ఒకటే. బయట ఉన్న కార్ వైపు చూసాను. అవను అది సినిమాలో వంశీ కార్. ఆ కార్ ఇక్కడ ఎందుకు ఉందో ఆ దెయ్యం ఈ బంగ్లాలోకి ఎలా వచ్చిందో అర్థం అవ్వటం లేదు.అంత అయోమయం గా ఉంది. చెమట తో వొల్లంత తడిసిపోయింది. వెనక్కి తిరగకుండా పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసాను. ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి టైం చూసాను. రెండు గంటలయింది. అలా రాత్రంతా నిద్ర పట్టక అలానే ఆలోచిస్తూ ఉండిపోయాను. దెయ్యాలు నిజంగానే ఉంటాయని నమ్మకం కుదిరింది. ఎపడు నిద్ర పోయానో తెలీదు గానీ తెల్లారాక ఆరు గంటలకు మెలుకువ వచ్చింది. ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తుంటే జిల్లా పేపర్ లో కనపడింది "మా ఊర్లో రామ్ భూపాల్ శర్మ తన సినిమా కి సేక్వేల్ తీద్దామని మా ఊరి బంగ్లని ఎంచుకున్నాడని, జనాలకి తెలీకుండా ఉండటానికి రాత్రిళ్ళు షూటింగ్ చేస్తున్నాడని, ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ మళ్ళి ఈ సినిమాలో కూడా చేస్తుంది" అని.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)