27, ఆగస్టు 2014, బుధవారం

నేనెంత ఎదవనో నాకే తెలీదు


 
[ఈ పోస్ట్ లో పాత్రలన్నీ కల్పితం. ఈపోస్ట్  లోని మరణాలకు గాని డైరెక్టర్ రాం భూపాల్ శర్మ కి ఎటువంటి సంబంధము లేదు.]
[No Animals were harmed while writing this story.]
 
సీన్ 1:
          నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో, చాన్నాళ్ళ తర్వాత ఆదివారం ఇంటికి వెళ్ళాను. అమ్మ చికెన్ బిర్యాని చేసి పెట్టింది. నేను సుష్టుగా భోజనం చేసి ఓ తెలుగు సినిమా అంత లెంగ్త్ స్లీప్ ఏసాను. సాయంత్రం లేచి మళ్ళి హాస్టల్ కి బయల్దేరుతూ “అమ్మ మార్నింగ్ చేసిన బిర్యానీ ఉందా?” అని అడిగా. కొంచమే ఉంది టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తాను వెళ్ళాక తిను అంది. (చిన్నప్పడు పొద్దున్నే 6కి కోడి కూస్తే చిర్రెత్తుకోచ్చేది కాని మద్యాహ్నం అదే కోడి కూరగా మారి చాలా రుచిగా ఉండటంతో చికెన్ మీద చాలా మమకారం పెరిగింది నాకు). “ఎంత తక్కువ ఉన్నా చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అవదుగా! అదే బాక్స్ లో పెట్టి ఇచ్చేయ్” అన్నాను. అమ్మ రెండు బాక్స్ లు పెట్టి ఇచ్చింది. ఇదేన్టమ్మ రెండో బాక్స్ అని అడగితే ఆలూ కూర అని చెప్పింది. “అమ్మా,మనిషన్న వాడు ఎవడన్నా చికెన్ బిర్యానీ లోకి ఆలూ కూర ఏస్కుంటాడా? తీసేయ్ ఈ కూర” అని అమ్మ చెప్పేది వినకుండా బాక్స్ తీసి అమ్మకి ఇచ్చేసి హాస్టల్ కి వచ్చేసాను.
రాత్రి తిందామని బాక్స్ ఓపెన్ చేస్తే బిర్యానీ ఉంది కాని అందులో చికెన్ లేదు. అప్పుడు తెలిసింది అమ్మ ఎందుకు ఆలూ కూర పెట్టిందో. కాని ఒక విషయం తెలీలేదు....అదేనండి...నేనెంత ఎదవనో.
కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ ఏస్తే..
సీన్ 2:
          అది ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో టీవీ చూసే రోజులు. స్కూలులో సాయంత్రం స్టడీ హవర్స్ ఉండటం వలన మద్య రాత్రి వరకు స్కూల్ లోనే ఉండేవాడిని. ఓ రోజు వర్షం బాగా కురవడం తో కప్పలు బాగా అరవడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. అదే టైం లో నా మైండ్ లొ ఒక ఆలోచన కూడా వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్స్ చెవులలో చెప్పాను. వాళ్ళు కూడా నా ఐడియా విని చాలా ఎక్సైట్ అయ్యారు. స్టడీ హావర్ అయిపోయి అందరు వెళ్ళే వరకు ఆగి ఆ తర్వాత ప్యాంటు పైకి మడతపెట్టి కప్పల కోసం వెతకడం మొదలెట్టాం. అలా మేము కప్పల వెంట పడ్డాం. ఏనుగు విష్ణుమూర్తిని వేడుకున్నట్లు ఆ కప్పలు మా ప్రిన్సిపల్ ని వేడుకున్నాయో ఏమోగాని మా ప్రిన్సిపల్ మా కళ్ళెదుట ప్రత్యక్షమయ్యాడు.
“ఏరా ఏమి చేస్తున్నారురా!” అన్నాడు మా ప్రిన్సిపల్.
“.....”ఎవరము ఏమి మాట్లాడలేదు.
మా ఫ్రెండ్ వీపు మీద ఒక మెరుపు మెరిసింది. ఆ దెబ్బకు వాడు కప్పలు పడుతున్నామని చెప్పేసాడు.
“ఎందుకురా కప్పలు” అని అడిగాడు మా ప్రిన్సిపల్.
మళ్ళి వాడి వీపు మీద మరో మెరుపు మెరవడంతో నేను ఒక ఐడియా ఇచ్చానని చెప్పేసాడు.
మా ప్రిన్సిపల్ నా దగ్గరకి వచ్చి ఎంటా ఐడియా అని అడిగాడు.
“కప్పల beep** ని ప్రాక్టికల్ గా తెలుసుకుందామని పట్టుకున్టున్నాం సార్” అన్నాను.
అప్పుడు మా ప్రిన్సిపల్ కి అర్థం అయింది. కాని నాకర్థం కాలేదు. మళ్ళి చెప్పడం ఎందుకులేండి title మళ్లో సారి చదువుకోండి.
** anatomy అని ఇంగ్లీష్ వర్డ్ వాడితే గౌరవం గా ఉంటుంది గాని నిజం చెప్పాలంటె actual గా ఆ రోజు ఆ కప్పలు ఆడా మగా తెల్సుకోడానికి ప్రయత్నించాము అని స్కూల్ లో ఆ తర్వాత టాక్. నేనేప్డు ఆ వాక్యాల్ని ఖండించలేదు కూడాను.
కత్తిరిస్తే...
సీన్ 3:
ఒక రోజు రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి సెకండ్ సినిమా కి వెళ్లి వస్తున్నాను. బాగా లేట్ అవడంతో ఇంటికి వెళ్ళడానికి ఆటోస్ గాని బస్ గాని లేకపోవడముతో నడిచి వెళ్ళిపోదామని అనుకున్నాము. అది హిందీ సినిమా అవడముతో నాకేమి అర్థం అవక చాలా చిరాకుగా ఉండింది. దానికి తోడు రెండు కిలోమీటర్ లు నడవాల్సి రావడముతో నా తిక్క తిరుపతి కొన్డేక్కింది. నా ఫ్రెండ్స్ హిందీ సినిమా గురించి మాట్లాడ్కుంటూ ముందు నడుస్తున్నారు. నేను వెనక మెల్లగా నడుస్తున్నాను. ఒక వీధి కుక్క నా వైపు అదోలా చూస్తూ అరుస్తుంది. నాకసలే తిక్కగా ఉంది దాని అరుపు కి చిరాకేసి బెదిరించాను. అది వెనక్కి తగ్గలేదు. నేను రోడ్ మీద ఉన్న రాయి తీస్కుని దాని వెనక పరిగెత్తాను. తిక్క కుక్కనే పరిగెత్తించిన నా తిక్క ని చూసి గర్వపడి నా చేతిని కాస్త మడిచి నా భుజం మీద తట్టి శభాష్ అనుకున్నాను. అదే విషయాన్ని మా ఫ్రెండ్స్ కి చెప్తే tide ad లో తెల్ల చొక్కాని చూసి అబ్బురపోయినట్లు నన్ను చూసి చాలా గర్వపడ్డారు. అలా కాస్త ముందుకి వెళ్లి సందు తిరిగేసరికే వాళ్లకి అర్థం అయిపోయింది నేనెంత ఎదవనో. ఆ తిక్క(నా) కుక్క ఎలా చెప్పిందో తెలీదు కాని ఒక పది కుక్కలు మాకోసమే ఎదురుచుస్తున్నట్లున్నాయి, మేము సందు తిరగాగానే మా వెంట పడ్డాయి. మేము పిచ్చి కుక్కల్లా పరిగెత్తి మొత్తానికి బొడ్డు చుట్టూ ఏ ఇంజక్షన్ లేకుండా ఇంటికి చేరాము. మళ్ళి title ఒక సారి చదువుకోండి.
ఈ పోస్ట్ ముగించే ముందు మీకొక నీతి కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి...అదే చదవండి..ఎందుకంటే చివర్లో ఈ కథ లో నీతి (moral) ఏంటో చెప్పిన వాళ్లకి తగిన బహుమతి కూడా ఉంటుంది.
అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక ఏనుగు ఒక చీమ ఉండేవి. ఆ రెండు బెస్ట్ ఫ్రెండ్స్. (మీలో తెలివి కొంచం తక్కువ ఉన్నవాళ్ళు చీమ, ఏనుగు ఫ్రెండ్స్ ఏంటి విడ్డూరం అనుకొనుంటారు. మరి నేను ముందే చెప్పాను కదా ఇది కథ అని. కాబట్టి అవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్. మీలో కొంత మంది తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు అడవి మొత్తం ఏనుగు చీమే ఉండేవా! మిగతా జంతువులేమయిపోయాయి అని అనుకోవచ్చు. ఆ మిగతా జంతువులు అడవిలోనే ఉన్నాయి కాని ఈ కథ లో లేవు). చీమ, ఏనుగు కలిసి ఒక weekend స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాయి. స్విమ్మింగ్ చేస్తుంటే ఏనుగు కాళ్ళకి ఎదో తగిలితే చెయ్ పెట్టి తడిమింది.(తెలివయిన వాళ్ళు, ఏనుగు కి చేయి ఉంటుందా అని అడగొద్దు. ఇది కథ) దాన్ని పైకి తీసి చూసే సరికి ఏనుగు కి గుండె ఆగినంత పనయ్యింది. దాని చేతిలో ఒక గన్ ఉంది. చీమ ఆ గన్ ని చేతిలోకి తీస్కొని చేతి చూపుడు వేలుతో గిర గిర తిప్పింది.
ఏనుగు ఆశ్చర్యపోయి “చీమ భయ్యా, ఏంటి గన్ ని అల తిప్పావ్ బాగా తెలిసినట్లు. అలవాటుందా?” అని అడిగింది.
దానికి చీమ “సినిమాలు చుడట్లేదేంటి” అంది.
“Bro, నువ్వు సినిమాలు కూడా చూస్తావా అయతే నన్ను కూడా తీస్కేల్లవా!” అని ఏనుగు అడిగింది. దానికి సరే ఐస్ క్రీం సినిమా రిలీజ్ అయ్యిందంట. వెళ్లి ఆ సినిమా చూద్దాం ఈ రోజు సెకండ్ షో కి అంది. రాత్రి కి ఆ రెండు గళ్ళ నిక్కరు వేసుకొని పుల్ల ఐస్ చీక్కుంటూ ఐస్ క్రీం సినిమా కి వెళ్ళాయి. కాని unforunately ఆ సినిమా అయిపోయేసరికి ఆ థియేటర్ లోనే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రాణాలు విడిచారు.
దీన్ని బట్టి మీకు అర్థం అయిన నీతేంటి? చించండి.. బాగా ఆలోచించండి. ఏమి అర్థం కాలేదా? మీలాంటి వాడే ఎవడో రామాయణం అంతా విని కృష్ణుడికి రాధ ఏం అవుతుంది అన్నాడంట వెనకటికి. ఇంకా moral ఏంటి అని ఆలోచిస్తున్నారా! హుహుహహహః నేనెంత ఎదవనో నాకే తెలీదు.

7 కామెంట్‌లు:

Sirisha చెప్పారు...

lol.. neeku tikka vaste kukka in enduku papam kelakadam.. anyway, super post..:-)

Sirisha చెప్పారు...

Neeku tikka vaste papam kukka ni enduku bedirinchadam lol ...

kappalni kukkalni kollani aadukunnadi chaalaka cheemani simhanni kooda vaadukuntaraa? :P

Anyways, super post :) .. keep writing!

ధాత్రి చెప్పారు...

మీకు తెలియట్లేదు గానీ అందరికీ తెలుస్తున్నదన్నమాట..
అదే కదాండి నీతి.. :)
Superb..:)

3lok చెప్పారు...

thank you thank you

aadedevaru vaadedevaru...devudu aade jagannatakamlo manalni vaadukuntunnadu anthe...ne comment ki sambandham lekapoina linr bauntadani raasa :)

3lok చెప్పారు...

meeru malli vesesaaru :) tanq tanq

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహ :-)) ఐస్క్రీమ్ ఒక ఫ్రాంఛైజో.. అదేదోనంటండీ.. ఇక వరుసగా ఐస్క్రీమ్ రెండు, మూడు, నాలుగు ఇలా తీస్తూనే ఉంటాడట... మరి రెండో పార్ట్ కి ఎవరెవర్ని పంపిస్తున్నారు :-)

3lok చెప్పారు...

ee sari mimmalni pampiddam ;) jus kiddingg..thanks for the comment...

కామెంట్‌ను పోస్ట్ చేయండి