బాబు నోట్లో వేలేసుకొని చాలాసేపటినుంచి తల్లిని గమనిస్తూ ఉన్నాడు. ఎర్రతేలుల ఉన్న తమ్ముడిని పదే పదే ముద్దు పెట్టుకుంటుంది అమ్మ. వాడికి లాల పోసి మళ్లీ ముద్దు పెట్టుకుంది. గంటసేపు కాలి మీద పడుకోబెట్టుకొని పౌడరు రాసి కాటుక పెట్టి నల్లటి బొట్టు ముఖం మీద బుగ్గ మీద పెట్టి మళ్ళీ మళ్ళీ తమ్ముడిని ముద్దాడింది.
బాబుకి చాలా కోపంగా ఉంది. తను వెళ్లి తమ్ముడి వేలు ముట్టుకుంటే వాడు ఎందుకో గుక్క పట్టి ఏడ్చాడు. వెంటనే గుభీ గుభీమని తన వీపు మీద రెండు గుద్దులేసి తమ్ముడిని గుండెలకు హత్తుకుని పాలిస్తూ 'ఫో వెదవా మీ నాన్న దగ్గరికి!' అని కసిరింది అమ్మ. బాబు గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. తమ్ముడి మీద చెప్పలేనంత అక్కసు కలిగింది వీదూ వచ్చాక అమ్మకి తన మీద ప్రేమ పోయింది. అంతకు ముందు ఎప్పుడూ తననే ముద్దుపెట్టుకునేది. 'టీచర్ గారు ఏం చెప్పార్రా బాబీ' అంటూ తను ఎన్ని రైమ్స్ చెప్తే అన్ని ముద్దులిచ్చేది. పొద్దుటే లేచిలేవంగానే అమ్మానాన్నారూ చేరోముద్దు ఇచ్చేవారు.ఎంతో గారంగా తను చేసే అల్లర్నంత భరించి తనచేత పాలు తాగించి లాలపోసి తల దువ్వి నిక్కరు చొక్కా వేసి పౌడరు రాసి ముద్దు పెట్టి స్కూలుకి పంపేది అమ్మ. నాన్నారి స్కూటర్ ఎక్కి టాటా చెప్తుంటే అందంగా నవ్వేది అమ్మ. మళ్ళీ సాయంత్రం బళ్ళోంచి రాగానే అప్పచ్చులు పెట్టేది. ఆడుకొని రాగానే మళ్ళీ లాలపోసి ముస్తాబు చేసి ముద్దు పెట్టుకొనేది.
కాని అమ్మ పొట్టలోకి ఈ ఎర్రతేలు వేదవ దూరంగానే అమ్మ మారిపోయింది. చిన్నపొట్ట ఉన్నప్పుడు లోపల తమ్ముడు అల్లరిచేసేవాడు కాదట. పొట్ట పెద్దదవంగానే తమ్ముడు అల్లరి మొదలెట్టాడని నాన్నారు చెప్పారు. 'అల్లరి చేయకుండా వాడిని కొట్టు' అన్నాడు నాన్నగారితో. నానారు అదిరిపడి 'తప్పమ్మా బాబీ! అమ్మకి దెబ్బ తగలదూ ?' అన్నారు.
పోనీ అని అప్పుడూరుకున్నాడు తను. ఎప్పుడూ అమ్మ పక్కలో లేనిదే నిద్రపట్టదు తనకి. పీడకలలు - దెయ్యం కలలు - టీచరు చెప్పే మాంత్రికుడి కలలు - రోజు పడ్కున్నాక వస్తే భయమేసేది తనకి. అమ్మ మారిపోయింది. తమ్ముడు వెధవకి పొట్టలో దెబ్బ తగులుతుందని తనను పడ్కోబెట్టుకోదట. నాన్నారి దగ్గరేమో సిగరెట్టూ కంపు. పైగా కాలు మీద వేస్తే 'వెదవా సరిగా పడుకో' అని దూరంగా తోసేస్తారు తనకి మళ్ళీ కల వచ్చి భయం. అమ్మ చిచిపోయించి నిద్రపుచ్చేది. నాన్నారు మర్చిపోయారు. పక్కమీదే నిద్రలో చిచ్చిపోసేస్తే నాన్నారు రెండు పుచ్చుకున్నారు పరుపు పాడయిన్దంటూ. 'మరి నిద్రపోయేముందు నువ్వెందుకు చిచ్చిపోయించలేదు?' - కోపంగా చూసాడు తను. కానీ నాన్నారికి అర్థం అయితేనా?
మడత మంచం మీద కూలేసి 'పడుకో' అని కేకలేశారు. భయమేసి అమ్మ పక్కలోకేల్లి పడుకుంటే మళ్ళీ ఎప్పుడెల్లిపోయిందో మడత మంచం మీద పడుకుంది. ఎంత కోపం వచ్చిందని! ఈ తమ్మ్ముడు గాడు అసలు బాలేదు - నల్లగా ఉన్నాడు వాడిని బాగా ఉతకమని అమ్మకి చెప్పాలి. వాడు నవ్వితే చాలా బాగుంటాడు. ముద్దుపెట్టుకున్దామని వంగితే 'ఎంగిలి అవతలికి పో ' అంటుంది అమ్మ. ఇంకెలా?
అమ్మా నాన్నారు వాడిని ముద్దుపెట్టుకుంటే ఎంగిలవదేం? అమ్మ దగ్గర బబ్బుని ఎన్నాళ్ళయిందో? అమ్మమ్మ దగ్గర బబ్బోమని అంటుంది అమ్మ. అబ్బా ముసలి కంపు.
తమ్ముడికి రోజూ కొత్త చొక్కాలు వేస్తుంది అమ్మ. 'నాకో' అంటే 'స్కూలు డ్రెస్సు మొన్ననేగా కుట్టించాను! అది వెసుకో' అంది. అసహ్యంగా స్కూలు డ్రేస్సేమి బాగుంటుంది?
'అమ్మా ఇవాళ నీ దగ్గర బబ్బున్టానే '
'వద్దమ్మా తమ్ముడికి నొప్పెడుతుంది'
'ఎప్పుడూ తమ్ముడేనేంటి? నాకు భయం' మొండికేసాడు బాబు.
'నన్ను విసిగించకు. మద్యాహ్నం అంతా చంటి వెధవతో నిద్రలేదు రాత్రి నువ్వు తయారవుతావా? అమ్మమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి గాని పోయి పడుకో'
'ఎం వద్దు. తమ్ముడినే పడుకోబెట్టుకో. రోజూ వీడే ఎందుకు పడుకుంటాడు నీ దగ్గర?'
'వెధవ ప్రశ్నలేయకు వెళ్ళు మంచం ఎక్కకు మట్టి కాళ్ళతో' అని బాబుని విసుక్కుంది.
'తమ్ముడి వెధవని చంపేస్తాను' బాబు గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. వాడి కళ్ళు, ముక్కు కోపంతో అదురుతున్నాయి. హడలిపోయింది వేద.
'ఛీ వెధవ పెచీలోద్దన్నానా? నీకు ఆకలేస్తున్దిగాని వెళ్ళు అమ్మమ్మను అన్నం పెడుతుంది. తిని నాన్నారి దగ్గరకి పో'
'నువ్వే పెట్టు'.
ప్రాణం విసుగెత్తి రెండు అంటించింది అమ్మ. బాబు ఏడుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మంచం పక్కనే కింద దొర్లి దొర్లి నిద్రపోయాడు. చిన్న బాబుకి స్నానం చేయించి పౌడరు రాసి కాటుక పెట్టి చొక్కా తొడిగి ముద్దు పెట్టుకుంది వేద. బాబు తదేకంగా చూస్తున్నాడు వాడిని కూడా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చిన్నవాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది.
పావుగంట కాకముందే పసివాడి ఏడుపు వినిపించేసరికి గుండెలదురుతుంటే పరుగెత్తుకొని వచ్చింది. ఉయ్యాల దగ్గరికి ఎప్పుడు ఈడ్చుకొచ్చాడో చిన్న స్టూలు తెచ్చి దాని మీద నుంచుని ఉన్నాడు బాబు. వాడి చేతిలో పెద్ద రాయి ఉయ్యాలలో పసివాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పిశాచాన్ని చూసినట్లనిపించి కెవ్వుమంది వేద.
అంతా చీకటి. లైటు వేసి పరిగెత్తుకొచ్చాడు రాజ రావు.
'వేదా ! మళ్ళి పీడకల వచ్చిందా?'
'బాబు చిన్నవాడిని బతకనివ్వడండి' రెండు చేతుల్లో తల పెట్టుకొని బావురుమని ఏడ్చింది వేద.
'ఛీ ఊరుకో పిల్లలు లేస్తారు. ఏమయింది నీకు. ఇందాక కూడా ఇలాంటి కలే వచ్చిందా? బాబు తమ్ముడిని చంపడమేమిటి' అయోమయంగా ఉంది అతనికి.
దాదాపుగా గంట తర్వాత ఆమె తల ప్రేమగా స్పృశించాడు రాజారావు.
'పిచ్చిదానా తల్లివయుండి పసివాడు మనసునిదేనా నువ్వు అర్థం చేసుకున్నది? ఈ కలలన్నీ నీ ఊహలే. బాబుకి తమ్ముడంటే ఎంతో ప్రేమ. నిద్రపోయేటప్పుడు వాడిని కూడా రేపట్నుంచే స్కూలుకి తీస్కేల్తానని మారం చేసాడు'.
'మరి....'
'మనం చాల పొరపాటు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది వేద!' సాలోచనగా అన్నాడతను.
'అంటే?'
'బాబుది తెలిసీ తెలియని వయసు. ఈ అయిదేళ్ళు వాడిని ఒక్కడే కొడుకని విపరీతమయిన గారం చేసాము. వాడు అడిగినదల్లా కొనిచ్చి ముద్దు ఛేసాం రెండవ వాడు పుట్టగానే వాడి మీద శ్రద్ధ ఇటు మళ్ళింది మనకి అక్కడే పొరపాటు చేసాం'
'వాడికేం లోటు చేసాం? ఎప్పటిలాగే చూస్తున్నాం కదండీ!'
' ఎం చూస్తున్నావు టైం అంతా చిన్నవాడి సంరక్షనకే సరిపోతుంది. అది పసిమనసుకేం అర్థమవ్తుంది?'
'వాడికి కావలసిందల్లా అమ్మ. అమ్మే అన్నం పెట్టాలి. నిద్ర పుచ్చాలి. అమ్మ దగ్గరే పడుకోవాలి. అమ్మే స్నానం చేయించాలి. తమ్ముడు వాటాకొచ్చేసరికి వాడి లేత మనసు తెలీకుండానే గాయపడింది. ఇది వరకు నిద్రపోతే అసలు లేచేవాడు కాదు ఇప్పుడు చూడు గడియ గడియ కి లేచి విసిగిస్తున్నాడు. వాడికి నువ్వు కావలి. వాడి అసహనం ఎందుకో వాడికే తెలియకపోయినా చిరాకు భరించలేక నోరు విడిచి నీ దగ్గర పడుకుంటాను అని అడిగాడు. వద్దనే సరికి కోపం వచ్చి తమ్ముడే కారణం అని కోపంలో అలా అన్నాడు'
'మరి ఎలాగండీ వీడి సంగతి?'
'మనలాగే చాలా మంది తల్లి దండ్రులు రెండో బిడ్డ రాగానే మొదటివాడిని నిర్లక్ష్యం చేస్తారు. ఉదయం పేపర్లో చదివిన సంగటన నీ మనసులో ముద్ర పడిపోయింది కదూ! పెద్దవాల్లయ్యాక అన్నదమ్ముల మద్య అనుబంధం లోపించింది అని బాధ పడతాం తప్ప మనమే కారణమని తేలియదు మనకి. రెండో బిడ్డ రాబోయే ముందే పెద్దవాడిని వాడి రాక కోసం సిద్దం చేయాలి లేదా వాడి లేత మనసుకు అర్థం అయ్యేటట్లు తమ్ముడు అంటే ఆడుకోడానికి వచ్చే స్నేహితుడని వాడిని ప్రేమగా చూడాలనీ చెప్పాలి. వాడి వంటి మీద చెయ్యే వెయ్యనివ్వవు నువ్వు. బాబుకేమో సహజమయిన కుతూహలంతో చిన్నవాడిని ముట్టుకోవాలని ఉంటుంది.'
'పసివాడికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని భయపడ్డాను గాని, బాబు లేత హృదయానికి తగిలిన దెబ్బను గుర్తించలేకపోయాను అండీ ! ఒక తల్లి కడుపునా పుట్టకపోయినా రామ లక్ష్మణులెలా కలిసిపోయారు? ఇంక నిద్రపోండి. అర్థ రాత్రి దాటింది'
'మళ్ళీ పీడకలోస్తే?'
'ఇంకా రావు నా మనసులో ఆందోళన తగ్గిపోయిన్డిగా.'
*****
మర్నాడు స్వయంగా అమ్మే తనకి స్నానం చేయించి ముద్దులు పెట్టుకుంటుంటే బాబు లేత మనసు పొంగిపోయింది. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ' అమ్మా! తమ్ముడిని స్కూలుకి తీసుకేల్లనా?'
ముద్దుగా అడిగాడు బాబీ.
'వద్దు బాబీ! తమ్ముడు ఇంకా చిన్నవాడు కదా! నీ అంత అయ్యాక తీసుకేల్దువు గాని. ఇంటికి వచ్చాక తమ్ముడితో ఆడుకున్డువు గాని' అని మళ్ళీ ఘాడంగా ముద్దు పెట్టుకుంది బాబుని.
వాడి కళ్ళు ఆనందంతో తలుక్కుమన్నాయి.....
******
( ఈ కథ నా సొంతం కాదు. మొన్నీ మద్య కోఠి లో ఒక చిన్న పాత పుస్తకం ఒకటి కొన్నాను. అందులో 1986 లో రాసిన మనసుకు హత్తుకునే ఈ కథ చదివగానే కళ్ళు చెమర్చి మనసు తేలికపడినట్లుగా అనిపించి అందరికి ఈ కథ చేరాలి అనే సదుద్దేశంతో ఈ బ్లాగులో రాసాను.)

1 కామెంట్లు:
Chala baagundandi.kadhanu anadritho panchinanduku dhanyavaadaalu..:))
కామెంట్‌ను పోస్ట్ చేయండి