అలా పూణే లో దిగిన మాకు వింత వింత మనుషులు తారసపడటం మొదలెట్టారు. పూణే లో జనాలు అలా ఉంటారో లేకపోతె మేము దిగిన వేళా విశేషమో గాని ఎవడికి వాడు ఒక్కో రకం. ఆ రకాలలో కొన్ని ఇక్కడ...
ఒకటో రకం:
ఈ ఒకటో రకం గాడు పొరపాటున మా ఇంటి ఓనర్ అయ్యి చచ్చాడు గాని ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి డబ్ చేసే భూతాల దిబ్బ,దెయ్యాల కోట లాంటి సినిమాలకో డబ్బింగ్ చెప్కోవాల్సిన వాడు. నేను మాములుగా పెద్ద వాళ్ళను వాడు వీడు అనను కాని వాడంటే మా అందరికి మసాల పెట్టని మిరపకాయ బజ్జి అంత మంట. వాడు మాట్లాడటం మొదలు పెడ్తే ఒక పట్టాన వదిలేవాడు కాదు. పూణే వెళ్ళిన కొన్ని రోజులకి తెలిసిన వాడు రూము ఉందంటే నచ్చితే అడ్వాన్సు ఇద్దామని డబ్బులు కూడా తీస్కోని వెళ్ళాము. ఆ రోజు అలా పరిచయమవ్వగానే ఇంట్లోకి పిలిచి కూర్చోమన్నాడు. రూము చాలా లక్కీ అందులో ఉన్నవాళ్ళకి అని చెప్పి ఒక డైరీ ఓపెన్ చేసాడు. ఆ డైరీ లో అప్పటి వరకు ఆ రూం లో ఉన్న వారందరి పేర్లు రాసుకున్నాను అని చెప్పి డైరీ మాకిచ్చాడు చూడమని. ఆ డైరీ లో పేరు దానికి US లో జాబు, UK లో జాబు, జర్మనీ లో పెళ్లి అని రాసి పెట్టుకున్నాడు. అలా అందరి గురించి ఒక్కో ఐదు నిమిషాలు చెప్పి మెదడు ని మెత్తటి పకోడీ తిన్నట్లు తినేసాడు. హమ్మయ్య లిస్టు అంత ఇప్పటికి అయినా అయింది అనుకుంటుండగానే ఇల్లు తో పాటు మీకు furniture కూడా ఇస్తాను అనడు. తింటే తిన్నాడు గాని బ్రహ్మచారులకి fridge, TV set ఎవరు ఇస్తారు అని ఆనంద పడ్డాము. ఇల్లు చూపించాదంకి తీస్కెళ్ళాడు. ఇల్లు పర్లేదు బానే ఉంది. fridge చూపిస్తాను అని చెప్పి తుప్పట్టిన బీరువా తలుపు తెర్చాడు. TIDE ad లో తెలుపుదనం చూసి అవాక్కయినట్లు మేము అవాక్కయ్యాము. అది బీరువా కాదు fridgee. తుప్పట్టడం మూలంగా,లోపల కూడా ఎమన్నా పెట్టుకోడానికి అరలు లేకపోడం మూలాన తేడ పోల్చుకోలేకపోయాము గాని కేవలం చల్లగా ఉన్న కారణంగా అది fridge ayindi. సరేలే fridge తో పనేమీ ఉంటుందిలే అని Blue diamond( అలంటి టీవీ కంపెనీ కూడా ఒకటి చరిత్రలో ఉండేదని అప్పుడే తెల్సింది) టీవీ ఆన్ చేసాము. మరాఠీ ఛానల్ ఏదో వస్తుంటే ఛానల్ మార్చడానికి చూసేసరికి టీవీ స్క్రీన్ రావడం మానేసింది. అప్పుడు మా ఓనర్ ఇది చిన్న ప్రాబ్లంమే ఒక దేబ్బెస్తే వస్తుంది అని టీవీ ని దభా దభా నాలుగైదు పీకాడు. అదే మనిషి అయుంటే చావనన్న చచ్చేది లేకపోతె return గా రెండు పీకేది. వేరే ఇల్లేమీ కనపడక అదే ఇంట్లో తప్పక దిగాము. రోజు సాయంత్రం గేటు సౌండ్ రాగానే మా డోర్ దగ్గర కోచేసేవాడు మీ కంపెనీ గురించి నాకు తెల్సు నేను ఒక టైం లో software అనేవాడు, ఏం అయినా ప్రాబ్లం ఉంటె చెప్పండి నేను చూస్కుంటాను అని మాటలతో మా మైండ్ తినీసేవాడు. ఒక్కో సారి వండున్తున్న వంటలు మాడిపోతున్న కూడా వదిలేవాడు కాదు.
రెండో రకం:
జుట్టు బాగా పెరిగింది తర్వాతి రోజు నుంచి ఆఫీసు కి వెళ్ళాలి అని hair saloon కి వెళ్ళాము హెయిర్ కట్ చేయించడానికి. cutting చేయమని కూర్చున్నాము. వాడు నాకు మూడ్ లేదు అన్నాడు. వచ్చి రాని హిందీ లో నేను చెప్పింది అర్థం కాక అలా అన్నాడో లేక నేను తప్పుగా విన్నానో తెలీక పక్కన ఉన్నవాదిదో హెయిర్ కట్ చేయమని చెప్పించా. మళ్ళి మూడ్ లేదు అన్నాడు. ఇక్కడ hyderabad లో అయితే షాప్ కట్టేసే టైం అవ్తున్న కూడా ఎవరన్న వస్తే cutting చేసాకే షాప్ మూస్తారు. ఈడేంటి మూడ్ లేదంటాడు అని expression లేని షాక్ తో బయటికి వచ్చేసాము.
మూడో రకం:
మేము పూణే వెళ్ళిన కొత్తలో పొరపాటునో గ్రహపాతునో మా నలుగురిలో ఎవడికో అరటి పళ్ళు తినాలనిపించింది. మాలో ఒకడు అరటి పళ్ళ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆడ మనిషి అమ్ముతుంది. ఎంత అన్నము 20/- డజన్ అంది. సరే అని 10/- ఇచ్చి అర డజన్ ఇమ్మన్నాము. ఇవ్వనంది. డజన్ 20/- అయితే అర డజన్ 10/- కదా అన్నాము. అయతే అవ్వొచ్చు గాని నేను మాత్రం ఇవ్వను అంది. చేసేదేమీ లేక పూణే లో ఉన్నన్నాళ్ళు ఇంకోసారి అరటి పళ్ళ జోలికి వెళ్ళలేదు.
ఇలా ఎన్నో రకాలు కలిపి పూ.జా.భా - 2 . కుదిరితే ఇంకొన్ని రకాలు పు.జా.భా - 3 లో....
15, నవంబర్ 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


4 కామెంట్లు:
పూణె లో జనాలు మరీ అంత చెడ్డవాళ్ళు కాదు బాబూ! ఈ ఊళ్ళో కూడా తెలుగువారు ఓ అయిదులక్షలమంది ఉన్నారు.
పూణే లో అందరు అలానే ఉంటారని నా ఉద్దేశ్యం కాదు గాని మేము అడుగు పెట్టిన వేళ విశేషం వలనేమో అందరు అలంటి వల్లే తగిలారు. మీరు అన్యధా భావించవద్దని మనవి..:)
సరదాగా ఓ సారి కలుసుకోకూడదూ,పూణె గురించి కావలిసినన్ని కబుర్లు చెప్తాను.మా ఇంటావిడ ది తణుకే ! ( 09325508220)
క్షమించాలి.నేను పూణే జ్ఞాపకాలతో హైదరాబాద్ కి చాలా రోజుల క్రితమే వచ్చేసాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి